చైనా మ్యాప్ ను ఇప్పటివరకు ఎన్నిసార్లు మార్చిందో తెలుసా...?

Reddy P Rajasekhar

ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ఆ దేశం యొక్క రాష్ట్రాలను, జిల్లాలను, మండలాలను, సరిహద్దులను సూచిస్తుంది. మన దేశం మ్యాప్ లో తొలినాళ్ల నుండి కశ్మీర్ కూడా భారతదేశం అంతర్భాగంగానే ఉంది. కాకపోతే కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ సొంతమైంది. ఆక్సాచిన్ కూడా మ్యాప్ ప్రకారం భారత్ ప్రాంతమే. ఏ దేశం అయినా ఎంతో అవసరమైతే మాత్రమే మ్యాపుల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. 
 
అయితే చైనా మాత్రం ఇప్పటివరకు 48సార్లు మ్యాపుల్లో మార్పులు చేసింది. చైనా వియత్నాంలోని కొన్ని భూభాగాలను మ్యాపుల్లో చేర్చుకుంది. నేపాల్ కు సంబంధించిన గ్రామాలను కూడా తన మ్యాపుల్లో జత చేసుకుంది. టిబెట్ తో పాటు తైవాన్ కు సంబంధించిన భూభాగాలు కూడా చైనాతో జత అయ్యాయి. తాజాగా భూటాన్ భూభాగాలు కూడా చైనా చేర్చుకోవడం వింత అని కామెంట్లు చేస్తున్నారు. 
 
జపాన్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ భూభాగాన్ని కూడా చైనా తమదే అని చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. చైనా మ్యూపుల్లో ఆక్రమించని దేశాలేంటో లెక్క పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చైనా ఎన్నిసార్లు మ్యాపును మారుస్తుందనే చర్చ జరుగుతోంది. చైనా ఇప్పటివరకు లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని తెలుస్తోంది. పొరుగుదేశాలతో పేచీ పెట్టుకుని ఎంతో కొంత భూభాగాన్ని భారత్ ఆక్రమిస్తోంది. 
 
చైనా ఇతర దేశాలు యుద్ధాలకు దిగకుండా చిన్నచిన్న భూభాగాలను ఆక్రమిస్తోంది. దీనినే క్యాబేజీ వ్యూహం అని కూడా చెబుతూ ఉంటారు. చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తోంది. గల్వాన్ లోయ, అక్సాచిన్, అంగేరీ, ఇతర ప్రాంతాలను చైనా ఈ విధంగానే ఆక్రమించిందని తెలుస్తోంది. మొదట తన మ్యాపులో ప్రాంతాన్ని యాడ్ చేసుకుని ఆ తరువాత ఆ ప్రాంతాలను చైనా ఆక్రమిస్తోంది.              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: