అమెజాన్ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు..... ఏం జరిగిందంటే.....?
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు ఆ కంపెనీ ఉద్యోగులే షాక్ ఇచ్చారు. జర్మనీలో అమెజాన్ ఉద్యోగులు నిరసనకు దిగారు. అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో హక్కులు, కార్మికుల భద్రత గురించి పోరాటం చేయడానికి జర్మనీలో అమెజాన్ కంపెనీల ఉద్యోగులందరూ నిరసనకు దిగారు. రెండు రోజుల పాటు జర్మనీలో సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు నిన్న ప్రకటన చేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండటంతో అమెజాన్ సంస్థలోని ఉద్యోగులు కూడా కరోనా భారీన పడ్డారు. ఇలాంటి సమయంలో అమెజాన్ సంస్థ ఉద్యోగులను కనీసం పట్టించుకోవడం లేదని.... కరోనా సోకిన వారికి సంస్థ ఎటువంటి ఆర్థిక సహాయం అందజేయటం లేదని.... కరోనా కష్టకాలంలో సైతం కంపెనీ స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని.... ఉద్యోగుల భద్రత గురించి ఆలోచించటం లేదని వారు చెబుతున్నారు.
'గుడ్ అండ్ హెల్తీ వర్క్' అనే నినాదంతో వారు సమ్మెకు దిగుతున్నారు. ఉద్యోగ సంఘం ప్రతినిధి ఓర్హాన్ అక్మాన్ రెందు రోజుల పాటు సమ్మె జరుగుతుందని....... జర్మనీలోని వివిధ కేంద్రాల్లో పనిచేస్తున్న దాదాపు 30 - 40 మంది వైరస్ భారీన పడ్డారని..... అయినా ఇప్పటివరకు వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని వ్యాఖ్యానించారు. అయితే ఉద్యోగులు చేస్తున్న ధర్నా గురించి అమెజాన్ స్పందించింది.
ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అమెజాన్ పేర్కొంది. జూన్ నాటికి సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30,227 కోట్లు) ఉద్యోగులు, కస్టమర్ల భద్రత కోసం ఖర్చు పెట్టామని పేర్కొంది. 18 మిలియన్ల ఫేస్ మాస్కులు, 21 మిలియన్ల గ్లవుజులను ఉద్యోగుల కోసం అందించామని సంస్థ పేర్కొంది. జర్మనీ అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ సంస్థకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొన్నారు.