వర్షాల వల్ల కరోనా పెరుగుతుందా ? తగ్గుతుందా ? సైంటిస్టు లు ఏమంటున్నారు ?

KSK
దేశంలో ఉన్న కొద్ది కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. ఊహించని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో కేంద్రంలో మరియు వైద్యుల లో భయాందోళన నెలకొంది. మరోపక్క కేసులు పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ  ఉండటంతో…. ఇది జనాలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి సమయంలో దేశంలో వర్షాకాలం రావటంతో మరింతగా కరోనా ముప్పు పెరిగే అవకాశం ఉందని జనాలలో ఇంకా భయం ఆందోళన ఎక్కువ అయ్యాయి.

ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో కరోనా వైరస్ ఎక్కువసేపు జీవించే అవకాశం ఉంటుందని గతంలో వార్తలు మరియు సైంటిస్టులు చెప్పడం జరిగింది. దీంతో వర్షాకాలం కావడంతో ఎక్కడా చూసిన నీరు ఉండే అవకాశం ఉండటంతో తేమ ఉండటంతో జనాలు భయపడుతున్నారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో సడన్ గా వర్షాలు పడిన వెంటనే ఒకేసారి రోడ్డుమీద అందరూ ఏదైనా షెల్టర్ కిందకి వస్తే…. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసే పరిస్థితి ఉండదు, అదేవిధంగా మాస్క్ లు ధరించి బయటకు వెళ్లిన సమయంలో మాస్క్ లు వర్షానికి తడిస్తే పరిస్థితి ఏమిటి వాటి వల్ల కూడా వైరస్ వచ్చే అవకాశం ఉందా ఇలా అనేక రకాల అనుమానాలతో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జనాలు గజగజ లాడుతున్నారు. 

అయితే ఇందుకు వైద్యులు పలు సలహాలు చెబుతున్నారు. అవేమిటంటే…

* నిరంతరాయంగా మాస్కులను ధరించడం వల్ల శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు శ్వాస వ్యాయామాలు చేయాలి. సుదీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామం చేస్తే.. శరీరానికి ఆక్సిజన్‌ సరఫరాను పెంచవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* సలైన్‌ వాటర్‌ను గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఆ వాటర్‌ వైరస్‌లను నాశనం చేసి గొంతు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

* ఆవనూనె వంటి నూనెలతో ముక్కును క్లీన్‌ చేయాలి. లోపలివైపు ఆ నూనెను వాడాలి. దీంతో ముక్కు రంధ్రాల్లో చేరే వైరస్‌లు నశిస్తాయి.

* వర్షాకాలంలో తడిచిన మాస్కులను అస్సలు వాడరాదు

* బయటకు వెళ్లినప్పుడు, దేన్నయినా టచ్‌ చేసే ముందు, చేశాక కచ్చితంగా శానిటైజర్‌ వాడాలి.

* గాయాలను యాంటీ సెప్టిక్‌తో క్లీన్‌ చేసుకోవాలి.

* వాషబుల్‌ మాస్కులను బాగా ఉతికి పూర్తిగా ఎండిన తరువాత మాత్రమే వాడాలి.

* తడిచిన, ఒక్కసారి మాత్రమే వాడాల్సిన మాస్కులను పడేయాలి.

* వర్షం వల్ల రోడ్డు పక్కన షెల్టర్‌లో ఇతరులతో కలిసి నిల్చోవాల్సి వస్తే ఎవరితోనూ మాట్లాడకూడదు.

* ఆ సమయంలో ముక్కు, ముఖం, కళ్లను టచ్‌ చేయరాదు.

* చీదడం కూడా మానేయాలి.

* ఇతరులను ఎవరిని టచ్‌ చేయవద్దు.

* వీలైనంత వరకు భౌతిక దూరం పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: