టాలీవుడ్ @వైజాగ్ : జగన్ తో భేటీ పై వారంతా హ్యాపీనా ?
కరోనా కారణంగా తెలుగు చిత్ర సీమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో కళాకారులందరూ దాదాపు రోడ్డున పడ్డారు. దీంతో చిరంజీవి ఆధ్వర్యంలోని కొంతమంది సినీ పెద్దల బృందం టాలీవుడ్ సమస్యలను తీర్చే విధంగా చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి ఆధ్వర్యంలోని బృందం ఇప్పటికే భేటీ అవ్వడం, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యలను వారి ముందు ఉంచడం, ఆ విషయాలపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం తెలిసిందే. ఇక తెలంగాణలో షరతులతో కూడిన అనుమతులు ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ మంజూరు చేసింది.
ఇది ఇలా ఉంటే, నిన్న సాయంత్రం మూడు గంటలకు ఏపీ సీఎం జగన్ తో చిత్ర పరిశ్రమకు చెందిన సమస్యలపై చిరంజీవి బృందం చర్చించింది. ఈ భేటీలో చిరంజీవితో పాటు నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, పీవీపీ , రాజమౌళి, సి.కళ్యాణ్ తదితరులు జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలను చిరంజీవి బృందం జగన్ దృష్టికి తీసుకు వచ్చింది. ఏపీలో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలంటూ ఈ సందర్భంగా జగన్ ను వారంతా కోరారు. అలాగే లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయని, ఆ సమయానికి కనీస విద్యుత్ రుసుము లను రద్దు చేయాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. అలాగే నంది అవార్డు లు పెండింగ్ లో ఉన్న అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.
2019 - 20 కి సంబంధించి నంది అవార్డుల ప్రధానం పై జగన్ స్పందించారని, త్వరలోనే ఆ కార్యక్రమం నిర్వహించేందుకు జగన్ ఒకే చెప్పినట్లు చిరు బృందం చెప్పింది. అంతేకాకుండా విశాఖ కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు జగన్ హామీ ఇచ్చారని, గత వైఎస్ఆర్ హయాంలోనే విశాఖలో చిత్ర పరిశ్రమ ఏర్పాటు కోసం 300 ఎకరాలు కేటాయించారని, ఆ భూములలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు. ఇక జగన్ కూడా విశాఖను ఎలాగూ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి చేస్తే, అక్కడ అన్ని రకాలుగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి జగన్ తాము చెప్పిన అన్ని విషయాలపైన సానుకూలంగా స్పందించడంతో చిరంజీవి బృందం ఈ భేటీపై సంతోషంగా కనిపించింది.