భారత్ చైనా వివాదం : కేంద్రం తీరుపై అసరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు... సమస్యను వివాదంగా మారనివ్వబోమంటూ చైనా ప్రకటన...?

Reddy P Rajasekhar

భారత్ చైనా వివాదం రోజురోజుకు ముదురుతోంది. శనివారం ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో భారత్ చైనా వివాదం గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చైనా నిన్న సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన వివాదంగా మారకుండా పరిష్కారం అయ్యేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా తూర్పు లడఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 
 
చైనా నుంచి తాజాగా వెలువడిన ప్రకటనలో శనివారం రోజున ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయని.... సరిహద్దు ఉద్రిక్తతలు వివాదానికి దారి తీయకుండా రెండు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలని నిర్ణయించామని తెలిపింది. శాంతియుత వాతావరణం నెలకొనేలా ఇరు దేశాలు కృషి చేస్తాయని కీలక ప్రకటన చేసింది. చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునియంగ్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. 
 
ఆదివారం రోజున భారత విదేశాంగ శాఖ నుంచి ఇదే విధమైన ప్రకటన వెలువడింది. అయితే సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఇరు దేశాలు ముగింపు ఎప్పుడు పలుకుతాయో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ భారత్ చైనా వివాదం విషయంలో కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సైనికాధికారుల చర్చల సారాంశాన్ని వెల్లడించాలని ఆయన కోరారు. 
 
చైనా ప్రతినిధులతో ఆర్మీ ప్రతినిధులు ఏం మాట్లాడారో తెలపాలని అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మౌనం దాల్చుతోందని ప్రశ్నించారు. చైనా భారత్ భూభాగాన్ని లడఖ్ లో ఆక్రమించిందా..? లేదా...? చెప్పాలని అన్నారు. మరోవైపు చైనా వస్తువులను బహిష్కరించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చైనా వస్తువులను నియంత్రించే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని నిర్ణయించింది.         
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: