కరోనా యుద్ధం : అందుకే మన దేశంలో మరణాలు తక్కువ..?
ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ కబళిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ మాత్రం పెరిగిపోతున్నది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన వారు ఉన్నారు. అయితే ప్రపంచంలోని అగ్ర రాజ్యాల తో పోలిస్తే భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఎంతో మేలు అని చెప్పాలి. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ తక్కువ కేసులు నమోదు అవ్వడమే కాకుండా మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంది.
ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి నగర ప్రాంతాలలో ఎక్కువగా వెలుగు చూస్తున్న తరుణంలో నగరాల నుంచి పల్లెలకు ఎక్కువగా వ్యాపించకుండా చూడడం కారణంగా క్రమక్రమంగా ఈ మహమ్మారిపై విజయం సాధించవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే పల్లెల్లో ఈ మహమ్మారి వైరస్ కు సంబంధించి సరైన అవగాహన ఉండదు వైద్యసదుపాయాలు ఉండవు కాబట్టి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తాయని... కరోనా వైరస్ పరీక్షల ఆధారంగానే కొత్త వైరస్ కేసులు కూడా చూడాల్సి ఉంటుంది వివరించారు.
అదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో అతి తక్కువ మరణాల రేటు నమోదు కావడానికి కారణం భారతదేశంలో యువ జనాభా ఎక్కువ ఉండటమే అని అంటున్నారు నిపుణులు. యువ జనాభా ఎక్కువగా ఉండటం కారణంగా వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది కరోనా వైరస్పై సమర్థవంతంగా పోరాటం చేయగలుగుతున్నారని... తద్వారా మరణాల రేటు తగ్గుతుంది అంటూ చెబుతున్నారు. అయితే ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించే విధంగా చూడడం ద్వారా ఈ మహమ్మారి వైరస్ ను దాదాపుగా నివారించవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.