షాకింగ్ : విశాఖ వాసులకు పొంచి ఉన్న మరో మహా ప్రమాదం...?
ఈ గ్యాస్ ను పీల్చినపుడు ఏమవుతుందని కనుగొనేందుకు ఫ్యాక్టరీలలోని కార్మికుల మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని చాల మంది పరిశోధకులు పరిశీలించారు. మరొక విషయం ఏమంటే సిగరెట్ పొగలో కూడా కొంత మోతాదులో స్టైరీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ ను తెస్తుందని కొన్ని పరిశోధనలలో శాస్త్రవేత్తలు చెప్పారు. స్టైరీన్ గొంతులోకి మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది. ఇది శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది సెంట్రల్, ఫెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. ఈ వాయువు పీల్చడం వల్ల నాడీ వ్యవస్థ మీద కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది. తల నొప్పి వచ్చే అవకాశము ఉంటుంది. డిప్రెషన్ కు దారితీస్తుంది. అలసట.. బలహీన పడడం.. వినికిడి కోల్పోవడం జరుగుతుంది. ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.