లాక్ ‌డౌన్ ఎత్తేస్తున్నారు...క‌రోనా ఎప్ప‌టికి తగ్గుతుందో తెలిసిపోయింది

Pradhyumna

 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌వ‌రం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో కొన్ని తీపి క‌బుర్లు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా దిగ్బంధంలో ఉన్న వివిధ దేశాలు లాక్‌డౌన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాయి. వివిధ దేశాల్లో ప‌రిమిత స్థాయిలో, కొన్ని దేశాల్లో పూర్తిగా స‌డ‌లింపు ఇస్తున్నారు. ఫ్రాన్స్‌లో మెక్‌డొనాల్డ్‌ షాపులు తెరుచుకోవడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. బెర్లిన్‌లో బుధవారం ఆంక్షలను సడలించారు. కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. నెల రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న సెర్బియాలో బుధవారం మార్కెట్లు, దుకాణాలు తెరుచుకున్నాయి. విక్రయదారులంతా మాస్కులు, గ్లౌజులు ధరించారు. 65 ఏండ్లకు పైబడిన వారిని వారానికి మూడు రోజులు పనులకు వెళ్లేందుకు అనుమతించారు. {{RelevantDataTitle}}