దేశ ప్రజలకు శుభవార్త... కరోనాకు మందు దొరికేసింది....?

Reddy P Rajasekhar

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాకు మందు, వ్యాక్సిన్ లేకపోవడం కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి అసలు కారణం. అయితే పలు దేశాలు కరోనాకు మందు కనిపెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ కనిపెట్టి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయి. 
 
కరోనా మందు పరిశోధనల్లో ఇజ్రాయిల్ దేశం విజయం సాధించిందని తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన ప్లూరిస్టెమ్ థెరపూటిక్స్ సంస్థ కరోనాకు మందు కనిపెట్టడం కొరకు అనేక ప్రయోగాలు చేస్తోంది. కరోనా భారీన పడి శ్వాస వ్యవస్థ దెబ్బ తిన్న ఏడుగురిపై మందును ప్రయోగించి వారికి కరోనాను నయం చేయడంలో ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. తాము కనిపెట్టిన థెరపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇజ్రాయిల్ పేషెంట్లపై ఏ థెరపీ ప్రయోగించి సక్సెస్ అయిందో అగ్ర రాజ్యం అమెరికాలో సైతం అదే తరహా పరిశోధనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. న్యూజెర్సీలోని ఒక రోగిపై అమెరికా శాస్త్రవేత్తలు అదే థెరపీని ప్రయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ థెరపీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందని.... ఈ థెరపీకి సంబంధించిన అన్ని ట్రయల్స్ పూర్తయిన అనంతరం అనుమతుల కోసం దరఖాస్తు చేశామని చెప్పారు. 
 
మరోవైపు ఇతర దేశాల్లో కూడా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను పూర్తి స్థాయిలో నియంత్రించే అవకాశం ఉంది. మరోవైపు మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయం వరకు దేశవ్యాప్తంగా 17,656 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం కరోనా బాధితులసంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో ఈరోజు ఉదయం వరకు 722 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 174 కరోనా కేసులు నమోదయ్యాయి. 149 కేసులతో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటివరకు 858 కరోనా కేసులు నమోదయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: