ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోక్ సభ స్పీకర్...!
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో దేవుడు మంచి ఆరోగ్యం... దీర్ఘాయువు ప్రసాదించాలని తాను ఆకాంక్షిస్తున్నానని... దేశ ప్రజలకు సేవ సేవ చేస్తూ చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. స్పీకర్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇతర భాషల్లో ట్వీట్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో బడా పారిశ్రామికవేత్తగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వేమిరెడ్డి సేవా తత్పరుడు అనే పేరు కూడా తెచ్చుకున్నారు. వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన వేమిరెడ్డి రాజ్యసభ ఎన్నికలకు ముందు నెల్లూరు వైసీపీ సమన్వయకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ కు ఎంతో సన్నిహితుడిగా వేమిరెడ్డికి మంచి పేరుంది.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏప్రిల్ 19 1956 సంవత్సరం జన్మించారు. వైసీపీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వేమిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల మంజూరు విషయంలో కూడా వేమిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఏపీలో కొన్ని రోజుల క్రితం వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలలో కర్నూలు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను జగన్ వేమిరెడ్డికి అప్పగించారు.
నెల్లూరు నగరంలో బిగ్ షాట్ గా వేమిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వేమిరెడ్డికి నెల్లూరు జిల్లాలో ఎంతో మంచి పేరు ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారిని ఆదుకోవడంలో వేమిరెడ్డి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మ దిన శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు ప్రసాదించాలని ఆంకాక్షిస్తున్నాను. మీరు దేశ ప్రజల సేవ చేస్తూ, మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. — lok sabha Speaker (@loksabhaspeaker) April 19, 2020