కరోనా మందుల తయారీలో హైదరాబాద్ ప్రత్యేకత !

NAGARJUNA NAKKA

కరోనా విజృంభణ తరుణంలో అందరి దృష్టి యాంటీ మలేరియా డ్రగ్ పై పడింది. కరోనాకు మందు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరో క్వీన్ వైరస్ ను కట్టడి చేస్తుందని తేలటంతో ఇపుడు .. హెచ్ సీ క్యూ  పై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.. అయితే డ్రగ్స్ తయారీలో దేశంలో సెకండ్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ లో కరోనా మందుల లభ్యత ఎలా ఉందో తెలుసా.

 

కరోనా కేసులు భారత్ ను వణికిస్తున్నాయి. దీనికి ట్రీట్ మెంట్  చేయడానికి మందులు లేకపోవడంతో  వాటి కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు యాంటీ వైరల్ డ్రగ్స్ వాడుతున్నారు. వీటిలో ఎక్కువగా ఫలితాలిస్తుంది హైడ్రాక్సీ క్లోరో క్వీన్.. ఈ విషయాన్ని ఇప్పటికే భారత వైద్య పరిశోధన మండలి సైతం స్పష్టం చేసింది.. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇపుడు కరోనా కట్టడి కోసం హైడ్రాక్సి క్లోరోక్వీన్ ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు.

 

ఔషధాల తయారీలో దేశంలోనే  హైదరాబాద్ ముందుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇపుడు అందరి కన్ను ఇక్కడే పడింది. మరోపక్క డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సైతం హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ను పెద్ద ఎత్తున తయారు చేయాలని కంపెనీలను కోరింది . ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కంపెనీలు కూడా హెచ్ సీ క్యూ తయారీ కోసం అనుమతులు తీసుకుంటున్నాయి.. మొదట్లో హైదరాబాద్ లో 7 కంపెనీలు మాత్రమే హైడ్రాక్సీ క్లోరో క్వీన్ ను తయారు చేసేవి.. ఇపుడు మొత్తం 20 కంపెనీలు యాంటీ మలేరియా డ్రగ్ ను తయారు చేసేందుకు సిద్దం అయ్యాయి.


 వాస్తవానికి గతంలో హెచ్ సీ క్యూ కు డిమాండ్ చాలా తక్కువ .. కరోనా కట్టడిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మందులను వాడుతుండటంతో కంపెనీలు తయారు చేయడానికి సిద్దంగా ఉన్నా .. ఇంకా బల్క్ డ్రగ్స్ రెడీ కష్టంగా ఉంది.. అయితే ఇతర రాష్ట్రాల నుంచి బల్క్ డ్రగ్స్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి..   ప్రస్తుతం ఉన్న మందులు దాదాపు 50 రోజుల వరకు సరిపోతాయి.. ఈ లోగా మందుల తయారీ మొదలు కానుంది..   ముందు ఇక్కడి అవసరాల కోసం తయారు చెయ్యాలని డ్రగ్ కంపెనీలకు అధికారులు ఆదేశించారు.. ఆ తర్వాత ఎగుమతులకు అవకాశం ఇస్తామంటున్నారు.

 

మరోవైపు  హైడ్రాక్సీ క్లోరో క్వీన్ అమ్మకాలపై షరతులు విధించారు.. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వద్దని మెడికల్ షాపులను ఆదేశించారు.. .. మామూలు జనం సైతం హెచ్ సీ క్యూ అడుగుతున్నారని,  నిబంధనల ప్రకారం అమ్మటం లేదంటున్నారు ఫార్మాసిస్టులు. ఈ డ్రగ్ ను హెచ్ వన్ జాబితాలో చేర్చారు.. మందుల స్టాక్ .. వివరాలు ఎప్పటికపుడు నోట్ చేయాల్సి ఉంటుంది.  మొత్తానికి హెచ్ సీ క్యూ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: