కరోనాకు విరుగుడు కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు... ఆ వ్యాక్సిన్ ఉపయోగించాలని వైద్యులకు సూచనలు...?
దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పేరు వింటే చాలు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు విరుగుడు కనిపెట్టడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాలో న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిన పరిశోధనల్లో టీబీ వ్యాక్సిన్ కరోనాకు విరుగుడుగా పని చేస్తుందని తేలింది.
పరిశోధకులు క్షయకు, కరోనాకు సంబంధం ఉందని... రెండు వ్యాధుల లక్షణాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. టీబీ వ్యాధి ఉన్న దేశాల్లో బీసీజీ (బాకిలస్ కాల్మెట్టె గ్యురిన్) వ్యాక్సిన్ ను ఎక్కువగా ఉపయోగిస్తారని.... ఈ వ్యాక్సిన్ ను వినియోగించే దేశాల్లో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. బీసీజీ వ్యాక్సిన్ క్షయతో పాటు ఇతర అంటువ్యాధులకు మందులా పని చేస్తుందని చెప్పారు.
ఈ వ్యాక్సిన్ ను ఎక్కువగా వినియోగిస్తున్న దేశల్లో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉందని న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫసర్ గొంజాలొ ఒటాజు చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో బీసీజీ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని నిబంధనలు ఉన్నాయి. కొన్ని దేశాలలో పరిశోధకులు అత్యవసర విధులు నిర్వహించే వారికి బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందా...? లేదా...? తెలియాలంటే మాత్రం మూడు నెలలు ఆగాల్సిందే. పరిశోధకులు వైద్యులు బీసీజీ వ్యాక్సిన్ ను కరోనా బాధితుల కోసం వినియోగించాలని సూచిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా కరోనాకు మందు కనిపెట్టడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.