కరోనాకు పైసా ఇవ్వని ఎంఎన్‌సీ కంపెనీలు వద్దే వద్దు... భారతీయ కంపెనీలే ముద్దంటోన్న భారత ప్రజ..?
దేశంలో గత మూడు రోజుల నుండి ప్రతిరోజూ 300కు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో కేంద్రానికి, రాష్ట్రాలకు ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. కరోనా కట్టడి కోసం, బాధితులకు సౌకర్యాలు కల్పించడం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరాళాలకు పిలుపునిచ్చాయి.
తాజాగా ఈ విరాళాలకు సంబంధించిన షాకింగ్ విషయం బయటికొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరాళాల కోసం పిలుపునివ్వగా ఇండియన్ కంపెనీలు, ఇతర కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాయి. దేశంలో వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్న మెజారిటీ మల్టీ నేషనల్ కంపెనీలు మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళంగా ఇవ్వలేదు. కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నా ఆ సంపాదనలో కొంతైనా సాయం చేయాలనే ఆలోచనే ఆ కంపెనీలకు లేకుండా పోయింది.
టాటా స్టీల్ 500 కోట్ల రూపాయలు, ఐటీసీ 150 కోట్ల రూపాయలు, హిందుస్తాన్ యూనీలివర్ 100 కోట్ల రూపాయలు, వేదాంత 100 కోట్ల రూపాయలు, హీరో సైకిల్స్ 100 కోట్ల రూపాయలు, బజాజ్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు, షిరిడి టెంపుల్ 51 కోట్ల రూపాయలు, బీసీసీఐ 51 కోట్ల రూపాయలు, సీఆర్పీఎఫ్ 33 కోట్ల రూపాయలు, అక్షయ్ కుమార్ 25 కోట్ల రూపాయలు, సన్ ఫార్మా 25 కోట్ల రూపాయలు, ఓలా 20 కోట్ల రూపాయలు, పేటీఎం 5 కోట్ల రూపాయలు, ముకేష్ అంబానీ 500 కోట్ల రూపాయలు, అదానీ గ్రూప్ 500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు, క్రికెటర్లు కోటి రూపాయలకు అటూఇటుగా విరాళాలు ఇచ్చారు.
కానీ నిత్యం మనం ఎక్కువగా కొనుగోళ్లు జరిపే, మన ద్వారా కోట్ల రూపాయల ఆదాయం పొందే సబ్ వే, పిజ్జా హట్, డోమినోస్, మెక్ డొనాల్డ్, బరిస్తా, బర్గర్ కింగ్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కే.ఎఫ్.సి, స్నాప్ డీల్, మింత్రా, రీడీఫ్, ఆడి, మెర్సిడెస్, బీ.ఎం.డబ్ల్యూ లాంటి కంపెనీలు మన దేశానికి ఒక్క రూపాయైనా విరాళాలు ఇచ్చినట్లు వార్తలు కాలేదు. ఆ కంపెనీల నుంచి విరాళాలు ఇస్తున్నట్లు ప్రకటనలు ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. భారతదేశ ప్రజానీకం ఆపదలో ఉన్న సమయంలో ఎటువంటి సహాయం అందించని మల్టీ నేషనల్ కంపెనీలు వద్దే వద్దని, ఇండియన్ కంపెనీలు ఎంతో ముద్దని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple