కరోనా ఎఫెక్ట్... ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఏప్రిల్ 14 వరకు పాలు, కూరగాయలు ఉచితం...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,000 దాటగా మృతుల సంఖ్య 50కు చేరింది. మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధికంగా 335 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 127 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో ఆరు పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ధృవీకరించాల్సి ఉంది. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలు రోడ్లపై రాకుండా ఇంటికే పరిమితం కావాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు పాలు, కూరగాయలు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. ప్రజలు నిత్యావసర వస్తువుల కొరకు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 
 
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉచితంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ప్రకటన చేశారు. లాక్ డౌన్ వల్ల సరైన రవాణా సదుపాయాలు లేక రైతులు పండించిన కూరగాయలను అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. హాప్ కామ్స్ ద్వారా కూరగాయలను కొనుగోలు చేస్తామని ప్రకటన చేశారు. 
 
రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏప్రిల్ 14 వరకు పేదలకు పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. సీఎం రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, పప్పు మిల్లులను తెరిచేందుకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. హాప్ కామ్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులతో పాటు కోడిగుడ్లను కూడా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు ప్రజలకు అందించేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: