ప్రాంతీయపార్టీల కూటమికి కదులుతున్న పావులు

కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏనిమిషానికి ఏమిజరుగునో అన్నట్లుగా ఉంది యూపిఏ ప్రభుత్వ పరిస్థితి. ముందుగా ఊహించినట్టుగానే మూడోఫ్రంట్ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో అన్ని ప్రాంతీయపార్టీలే ఉండేలా పావులు కదులుతున్నాయి.  ఇందులో భాగంగానే తృణమూల్ కాంగ్రేస్ యూపిఏ నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వాలలో ప్రాంతీయ పార్టీలదే ప్రధానపాత్ర. అయినా అధికారం మాత్రం జాతీయపార్టీలే అనుభవించాయి. కేంద్రంలోను అధికారపీఠం పై ప్రాంతీయపార్టీ ఉండాలన్న లక్ష్యంతో ఈఫ్రంట్ కు అంకురార్పన మొదట తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు చేశారు. ఇది మెల్లమెల్లగా రాజుకుని ఒక రూపం సంతరించుకో బోతోంది.  కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నందున సహజంగానే ఆపార్టీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. పైగా గతంలో ఎన్నడు లేని విధంగా అవినీతి అక్రమాలు ఈసారి వెలుగుచూసాయి. కాబట్టి కాంగ్రేస్ కు ఈసారి భవిష్యత్ లేదని ఇది దేశవ్యాప్తంగా కాంగ్రేస్ తో పాటు యూపిఏ ప్రభుత్వంలో భాగస్వామ్యులైన ప్రాంతీయ పార్టీలపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇది మిగిలిన ప్రాంతీయపార్టీలకు కలసి వస్తుందని మూడోఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న పార్టీలు అనుకుంటున్నాయి. దీంతో చక్కటి మెజార్టీ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు, ఏదైనా ప్రతికూలత ఏర్పడ్డప్పటికి అధికారం ఏర్పాటు లో మూడోఫ్రంట్ కీలకం కావచ్చని భావిస్తున్నారు.  ఇప్పటికే ఈఫ్రంట్ లో ఖరారని భావిస్తున్న పార్టీలలో ఏపి నుంచి తెలుగుదేశం,తమిళనాడు నుంచి అన్నాడిఎంకే(జయలలిత), పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్(మమతా బెనర్జి), యూపినుంచి ఎస్పీ(ములాయం) ప్రముఖంగా ఉన్నాయి. నితీష్ నేతృత్వంలోని జేడియూ(బీహార్) ఇప్పటికే ఓకే చెప్పేసింది. వీటిలో జయలలిత,మమత, ములాయం,నితీష్ లు ఇప్పటికే వారి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. వారి రాష్ట్రాల్లో ఎంపి సీట్లు పెద్దసంఖ్యలో వస్తాయని ఆశిస్తున్నారు. ఏపిలో కాంగ్రేస్ పరిస్థితి పూర్తిగా దిగజారింది, ఇక్కడ కూడా టీడిపి ఆశించదగ్గ పలితం రాబడుతుందని అంచనా. మొత్తం మీద రాజకీయాల్లో మాత్రం కీలకమార్పులు రానున్నాయన్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: