కరోనా బూచి: మరో మూడు నెలలు ?
ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ... దేశ లాక్ డౌన్ సమయంలో సమస్యను ఎదుర్కొంటున్న పేదవాళ్ళని, చిన్నాచితకా వ్యాపారస్తులని రక్షించేందుకు తాము ఎప్పుడూ పోరాడుతామని చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఆర్ధికవేత్తలు మాట్లాడుతూ... ఈ లాక్ డౌన్ కారణంగా రోజు కూలిల పరిస్థితి ఘోరంగా మారుతుందని హెచ్చరించారు. అందుకే కేంద్రం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి మనుగడ కోసం ఏకంగా 1.70 లక్షల కోట్లను ఇచ్చేనందుకు సిద్దపడింది.
ఈరోజు అనగా గురువారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న నిర్మల సీతారామన్ ఒక కోటి 70 లక్షల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ని ప్రజల తిండి కోసం, డబ్బు కోసం ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్ యోజన కింద 80 కోట్ల మందికి మూడు నెలలపాటు 5 కిలోల బియ్యం గానీ లేకపోతే అయిదు కిలోల గోధుమలను కానీ ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే బియ్యంతో పాటు ఒక కేజీ పప్పు దినుసులను 80 కోట్ల ప్రజలకి ఉచితంగా ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలియజేశారు. మూడు నెలల పాటు మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడంతోపాటు మూడు నెలలపాటు వారి జన్ ధన్ ఖాతాలో ప్రతి నెల కి 500 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉపశమన ప్యాకేజీలను ప్రతి ఒక్క విషయంలో మూడు నెలల పాటు సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం బట్టి చూస్తే... భారతదేశంలో కరోనా మహమ్మారి ఇంకొక మూడు నెలలు తిష్టవేస్తుందని నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple