
కరోనా అంతం.. అందరి పంతం.. ప్రధాని మోదీ నిర్ణయానికి జైకొట్టిన సోనియా...!
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే పిలుపు వినిపిస్తుంది. చిన్నా లేదు పెద్దా లేదు.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ కరోనా పేరు వింటేనే వణికి పోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లు ప్రపంచంలో తమ ప్రతాపాన్ని చూపించాయి.. కానీ ఈ కరోనా వైరస్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు భయంకరమైన వైరస్ కి యాంటీడోస్ కనుగొనలేదు. ప్రపంచవ వ్యాప్తంగా ఇప్పటికే 20 వేల మంది కరోనా భారిన పడి మరణించారు. మూడు లక్షల మంది వరకు కరోనా భారిన పడ్డట్టు సమాచారం. భారత దేశంలో కూడా కరోనా విస్తరిస్తుంది.. ఇప్పటికే పది మంది చనిపోయారు. 500 లకు పైగా కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం కరోనాను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు దేశ వ్యాప్తంగా మార్చ్ 24 నుంచి లాక్ డౌన్ చేశారు. ప్రజలు ఎవరి ఇంట్లో వారే ఉంటూ తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కొంతవరకు కంట్రోల్ అయినట్టుగా కనిపిస్తోంది. విపత్కర సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాలి. ఎప్పుడు సోషల్ మాద్యమాల్లో అధికార, ప్రతిపక్షాల మద్య చిటపటలు ఉంటూనే ఉంటాయి.
కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఒకరికొకరు సంఘీభావం తెలుపుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా సోనియా గాంధీ అదే చేసింది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. లాక్ డౌన్ నిర్ణయం మంచిదే అని చెప్పి కొన్ని సూచనలు చేస్తూ లేఖ రాసింది. కాకపోతే రాహుల్ గాంధీ మాత్రం కేంద్రం లాక్ డౌన్ చేసే ముందు కార్మికుల గురించి రోజువారీ వేతనం పొందే వారు ఇబ్బందులకు గురి అవుతున్నారని కామెంట్ చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple