కరోనా పేరెత్తితేనే వణుకుతోన్న గులాబీ పార్టీ ఎమ్మెల్యే...!
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే కరోనా సోకిన వారి సంఖ్య తెలంగాణలో 6కు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అనంతగిరిలోని చాతి ఆసుపత్రి, హరిత రిసార్ట్స్ దగ్గర కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇదే ఇప్పుడు వికారాబాద్ ఎమ్మెల్యే మెతకు ఆనంద్‌ను టెన్షన్ పెడుతోందట. సాధారణంగా ఎవరు అయినా మా ఊర్లో హాస్పటల్ పెట్టండి.. అని కోరుకుంటారు. కానీ అనంతగిరి వాసులు మాత్రం మా దగ్గర హాస్పటల్ వద్దు.. మాకు రోగులను తీసుకురావద్దు అని ఎమ్మెల్యే మెతకు ఆనంద్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడంతో పాటు ఆందోళన చేస్తున్నారు.
వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల కోసం కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ, గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలతో పాటు వికారాబాద్ చాతీ ఆసుపత్రి, హరిత రిసార్ట్స్ లను పరిశీలించారు. ఇక ఫైనల్‌గా అనంతగిరి హరిత రిసార్ట్‌లోనే ఆఘమేఘాల మీద ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు దీనిపై స్థానికంగా నియోజకవర్గ వాసుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ఇదే కరోనారా బాబు అని ఆనంద్ తర్జనభర్జన పడుతున్నారట. అది అసలు సంగతి.