జస్ట్ తుమ్మాడు.. అంతే విమానం ఎమర్జెన్సీ లాండింగ్!

Edari Rama Krishna

ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా (కోవిడ్ 19) భయం పట్టుకుంది.  పక్క మనిషి తుమ్మినా.. దగ్గినా విచిత్రంగా చూస్తున్నారు.  అతనికి ఖచ్చితంగా కరోనా సోకిందని పుకార్లు సృష్టిస్తున్నారు.  అంతగా భయపెడుతుంది ఈ కరోనా మహమ్మారి.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచం మొత్తం వ్యాపించింది అంటే దీని ఎఫెక్ట్ ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవొచ్చు.  తాజాగా కరోనా వల్ల ఇప్పటికే ప్రపంచం మొత్తం నాలుగు వేల మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇక వేల సంఖ్యలో ఈ కరోనా బాధితులు ఆసుపత్రుల పాలయ్యారు.  

 

సాధారణంగా ఒకసారి టేకాఫ్ అయిన తరువాత, విమానాలు వెనక్కు వచ్చేయడం లేదా గమ్యస్థానానికి కాకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం మరో ఎయిర్ పోర్టును సంప్రదించడం వంటి వార్తలు చాలానే వినుంటాం. అతి కూడా అత్యవసర పరిస్థితుల్లోనే ఈ సంఘటనలు జరుగుతుంటాయి.  కానీ కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఓ ప్రయాణికుడికి తుమ్ములు రావడంతో ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ, ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఇప్పటికే అమెరికాలో సైతం కరోనా మరణాలు సంబవిస్తున్న విషయం తెలిసిందే.  

 

కొలరాడో రాష్ట్రంలోని ఈగిల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీకి ఓ విమానం బయలుదేరగా, ఓ ప్రయాణికుడికి తుమ్ములు వచ్చాయి. దాంతో పాటు అతడు దగ్గడంతో పక్కన ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో పైలట్ తనకు సమీపంలో ఉన్న డెన్వర్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారాన్ని అందించాడు. ఫ్లయిట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరడంతో వారు అంగీకరించారు. పైలట్ డెన్వర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దించగా, అప్పటికే సమాచారాన్ని అందుకున్న వైద్యులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రయాణికుడికి వచ్చింది అలర్జీయేనని తేల్చారు.  మొత్తానికి కరోనా భయం ఈ విధంగా మనుషులను కంగారు పెట్టిస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: