కూతురి మాజీ ప్రియుడిని కిరాతకంగా హతమార్చిన తల్లి...అసలు కారణం అదే..

Satvika

మామూలుగా కూతురు ఎవరినైనా అబ్బాయిని ప్రేమించింది అంటే ఒంటికాలిపై కస్సు బస్సు లాడతరన్న విషయం తెలిసిందే..ఇంకా చెప్పాలంటే అమ్మాయి ప్రేమించిన వ్యక్తిని పిలిపించి బెదిరించడంతో, లేక ఏదైనా చేయడమో చేస్తారు.. అది సహజమే.. కానీ ఇక్కడ కాస్త రివర్స్ అయింది. అమ్మాయి ఫోన్ నంబర్ అడిగాడని తన మాజీ ప్రియుడిని ఓ కన్న తల్లి అతి కిరాతకంగా మట్టు పెట్టిన ఘటన ఇటీవలే వెలుగు చూసింది. 

 

 


వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.పెళ్ళైన తర్వాత కూడా తన మాజీ ప్రియురాలిని వదల లేని ఓ వ్యక్తి తన నంబర్ కావాలంటూ అమ్మాయి తల్లిని అడిగాడు. పెళ్ళైన కూడా వదలవా అంటూ కూతురిపై కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం చెందిన తల్లి.. కూతురి మాజీ ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఉదంతం బరేలీ జిల్లాలో వెలుగుచూసింది.

 

 

 

ఆశిష్ శర్మ అనే వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆశిష్ శర్మని ఆమె మాజీ ప్రియురాలి తల్లి, ఆమె సోదరుడు దారుణంగా హత్య చేసి  పాతిపెట్టినట్లు సమాచారం.. గతంలో ప్రేమించుకున్న ప్రేమికులు.. కొన్ని మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. అయినా కూడా అతను మర్చిపోలేని ప్రియుడు అమ్మాయి అమ్మను అడిగాడు.. 

 

 


దాంతో ఇంకా న కూతురిని వదలవా అంటూ ఆగ్రహం చెందిన మాజీ ప్రియురాలి తల్లి, తన కొడుకుతో కలసి ఆశిష్‌కి ఊపిరాకుండా చేసి చంపేసింది. శవాన్ని ఇంటి వెనకే పెరట్లో పాతిపెట్టేసింది. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య కేసుగా మార్చారు. హతుడి మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యలకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: