తప్పుల తడకగా ఇంటర్ ఇంగ్లీష్ పేపర్... విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఇంటర్ బోర్డు....?

Reddy P Rajasekhar

నిన్న జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయి. ప్రశ్నపత్రంలో ఒక పదానికి బదులు మరో పదం ముద్రించడం, అక్షర దోషాలు, వాక్య నిర్మాణాల్లో తప్పులు ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. విద్యార్థులు 6 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని చెబుతున్నారు. పరీక్ష కేంద్రాలలో పరీక్ష ముగిసే అరగంట ముందు తప్పులను సరిచేసుకోవాలని బోర్డు నుంచి వచ్చిన సమాచారాన్ని ఇన్విజిలేటర్లు వినిపించారు. 
 
కొన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు అదనపు సమయం ఇవ్వాలని ఇన్విలేటర్లను కోరినా ఫలితం లేకుండా పోయింది. 5, 7, 10, 12, 14, 17 ప్రశ్నలలో తప్పులు దొర్లాయని విద్యార్థులు చెబుతున్నారు. దాదాపు 15 మార్కులు తప్పుల వల్ల విద్యార్థులు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెల్లుస్తోంది. కంప్యూటర్ ద్వారా టైప్ చేయించిన ప్రశ్నపత్రాన్ని పరిశీలించకపోవడం వల్లే ఇలా జరిగిందని లెక్చరర్లు చెబుతున్నారు. 
 
ఇంగ్లీష్ పేపర్ లో దొర్లిన తప్పులపై బోర్డు స్పందించింది. ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో నాలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయని... వెంటనే పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చామని పేర్కొంది. 14వ ప్రశ్న అటెంప్ట్ చేసిన విద్యార్థులకు మాత్రం అదనంగా నాలుగు మార్కులు ఇస్తామని అధికారులు వెల్లడించారు. సమాచారం ఇచ్చిన ప్రశ్నలకు తాము ఎలాంటి మార్కులు యాడ్ చేయబోమని స్పష్టం చేశారు. 
 
బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రశ్నపత్రంలో 5వ ప్రశ్నకు why అని ఉండాల్సిన చోట what అని వచ్చింది. 17వ ప్రశ్నలో felicitation బదులుగా facililation అని ప్రింట్ అయింది. 10వ ప్రశ్నలో a book అనే పదం లేకుండా ప్రశ్న ఇచ్చారు. 12వ ప్రశ్నలో ear బదులు year అని ముద్రించారు. ఇంటర్ బోర్డు మార్కులు యాడ్ చేయబోమని స్పష్టం చేయడంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: