నీ కామం తగలెయ్య.. సరిపోరా ఎంతమంది కావాలి.. నీకు ఛీ ఛీ..

Satvika

కామంతో కొట్టుకుంటున్న ఓ కామాందుడు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్న కూడా  మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నది అసలేం జరుగుంది. అనేది చూస్తే షాక్ అవ్వాల్సిందే..  మొదటి భార్యని ఒప్పించి మరీ రెండో భార్యను ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ కలిపి ఐదుగురు పిల్లలు సంతానం. అయినా అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. మరో మహిళతో సాంగత్యం కోరుకున్నాడు. ఆమెతో ఆ సంబంధం పెట్టుకున్నాడు. అదే విషయంపై రెండో భార్య నిలదీయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు.. 

 

 

 

ఈ దారుణ  సంఘటన  కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మరో మహిళతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావంటూ నిలదీసినందుకు రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఎల్లారెడ్డి పరిధిలోని సదాశివనగర్ మండలంలో జరిగింది. సాజ్యనాయక్ తండాకి చెందిన శివరాంకి ఇద్దరు భార్యలు.అయితే మొదటి భార్యను ఒప్పించి రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు, 

 

 


ఇద్దరు భార్యలతో వేర్వేరుగా కాపురం పెట్టాడు. అయితే శివరాం కొద్దికాలంగా వేరొక మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. ఈ విషయం తెలిసిన రెండో భార్య మేనక భర్త శివరాంతో గొడవపడుతుండేది. అదే విషయమై మరోమారు ఇద్దరి మధ్య వివాదం జరగడంతో కోపంతో భార్యను విచక్షణ రహితంగా కొట్టాడు. దాంతో  ఆవిడను ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.. 

 

 

 

సృహలో లేకుండా పడి ఉన్న ఆమెను చూసి భయపడ్డ కుటుంబ సభ్యులు గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. అక్రమ సంబంధం గురించి ప్రశ్నించినందుకు భర్త దారుణంగా కొట్టి చంపేశాడని.. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు శివరాంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: