
హైదరాబాద్ కి కరోనా.. సమాధానం లేని ప్రశ్నలు ఇవే..?
చైనా దేశంలో గుర్తించబడి ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న వైరస్ కరోనా. ఇప్పటికే చైనా దేశంలో వేల సంఖ్యలో ప్రాణాలు తీసుకుని.. ఇంకా ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తున్న ఈ వైరస్ భారతదేశంలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయాయి. అయితే ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసు నమోదు కావటంతో ప్రజలు మరింత బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయింది. ఈ వ్యాధి రెండు వారాల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడికి సోకింది అంటూ నిర్ధారణ అయింది.
ఈ వ్యాధి సోకిన తర్వాత ఆ వ్యక్తి నడవడిక చర్యల కారణంగా ఇతరులకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఈ వ్యాధి. దీంతో ప్రస్తుతం కరోనా వైరస్ సోకినా ఒకటి రెండు రోజులపాటు బెంగళూరు కి వెళ్లి ఉద్యోగం చేసి వచ్చాడు. రెండుసార్లు బస్సులో ప్రయాణించాడు. బెంగళూరులో కూడా పలువురు ని కలుసాడు. ఇక ఈ యువకుడు ప్రయాణించిన బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ బస్సులో బాధితుడు తుమ్మినా దగ్గినా వైరస్ సులువుగా ఇతరులకు వ్యాపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కుటుంబ సభ్యులకు ఆ యువకుడు నుంచి కరోనా సోకేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు. అయితే దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఆ యువకుడు ఎవరు ని కలిశాడు...? యువకుడి కారణంగా ఎంత మందికి ఈ వైరస్ వ్యాపించింది...? వారి ద్వారా ఇంకా ఎంతో మందికి ఈ వైరస్ సోకింది...? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం ఎవరి వద్ద సమాధానాలు లేవు.
ఆ యువకుడి తో పాటు బస్సులో వచ్చిన 27 మందికి కరోనా వైరస్ సోకినదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.ఇక బాధితుడు తరపు బంధువులు కూడా 11 మందిని గాంధీ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించి పరీక్షిస్తున్నారు వైద్యులు. అయితే ఆ యువకుడు వచ్చిన బస్సులో కొంతమంది ఏపీ వాసులు కూడా ఉండడం.. వారు విజయవాడ కడప తదితర ప్రాంతాల్లో పర్యటించడం తో.. ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ కు కూడా వ్యాపించి ఉండవచ్చు అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.