వాట్సాప్ గ్రూప్ లో ఉంటే...మీ నెంబర్ ఖచ్చితంగా గూగుల్ లో కనిపిస్తుంది.

Suma Kallamadi
అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియా లో వాట్సాప్ ఒకటి.  వాట్సాప్ అతి సౌకర్యం గా సులువుగా ఉపయోగించడానికి వీలు గా ఉండడం చేత వాట్సాప్ ని వాడడం ఎక్కువ అయ్యి పోయింది. నిజంగా సోషల్ మీడియా లో ఉన్న వాటి మీద అనేక నేరాలు రావడం కూడా తెలిసిన విషయమే. అయితే వీటిలో మోసాలు, దాడులు మరీ ఎక్కువ అయ్యి పోతున్నాయి ఈ కాలంలో. అయితే వీటిని కట్టడి చేసేందుకూ, భద్రం గా ఉంచడానికి మరో విషయం తాజాగా జరిగింది.
 
 
నేరాలు ఎక్కువగా జరిగాయని అందరికీ తెలిసిన సంగతే. అలానే వాట్స్ ఆప్ పై ఉన్న లోపాలు కూడా అందరికీ తెలిసిన విషయమే. అనేక సందేహాలని దీని ద్వారా ప్రపంచం వ్యక్త పరిచింది. గతం లో వాటికి పెద్ద సమస్య ఏమీ రాలేదు.
 
కాకపోతే ఇప్పుడు వచ్చింది మాత్రం పెద్ద సమస్య గానే అయ్యి పోయింది అన్న వార్తలు కూడా వినబడుతున్నవి. ఈసారి మాత్రం పెద్ద చిక్కు వచ్చిపడింది. ఏకంగా ఫోన్ నంబర్స్ గోగుల్ లో కనపడుతున్నాయిట.
 
 
 
అయితే ఈ చిక్కు వల్ల వినియోగించే వారి ఫోన్ నంబర్స్ ఏకంగా గూగుల్ లో కనిపిస్తాయని అంటున్నారు. నిజంగా పెద్ద సమస్యే వచ్చి పడిందే. అయితే వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి ఒక లింక్ క్రియేట్ చేస్తారు గ్రూప్ ఎడ్మిన్స్. అయితే ఆ గ్రూప్ యడ్మిన్ పంపే లింక్స్ గూగుల్ లో కనిపిస్తూ ఉంటాయి.
 
 
అప్పుడు ఆ గ్రూప్ లింక్ ద్వారా ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అయ్యి పోవచ్చు. ఫోన్ నంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీని వల్ల ప్రమాదం ఉంది. కానీ గూగుల్ ఆ లింక్స్ కనిపించకుండా కట్టడి చేసింది. కానీ ఈ తప్పు గూగుల్ది కాదు. కట్టడి చెయ్యాల్సిన బాధ్యత ఫేస్ బుక్ దే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: