లక్కీ నంబర్.. ఇదో సెంటిమెంట్.. ఈ సెంటి మెంట్ కోసం కొందరు ఎంత పనైనా చేస్తారు. కలిసొచ్చే నెంబర్ కోసం.. ఫ్యాన్సీ గా కనిపించే నెంబర్ కోసం కాస్త డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం చూస్తూనే ఉన్నాం.. అందుకే రవాణా శాఖ కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేసి జనం క్రేజ్ ను సొమ్ము చేసుకుంటుంది. అయితే.. ఈ నెంబర్ల పై ప్రేమ కొంత వరకూ ఓకే..
కానీ.. ఏకంగా కారు ధరను మించిపోయేలా ఈ నెంబర్ల కోసం ఖర్చు చేసేవారుంటారంటే నమ్మడం కాస్త కష్టమే.. కానీ.. బ్రిటన్ కు చెందిన ఓ వ్యాపార వేత్త కారు ధరకు దాదాపు పది రెట్లు ఖర్చు చేసి దాని నెంబర్ దక్కించుకున్నాడంటే నమ్ముతారా.. ఈయన కొన్న కారు బుగెట్టి వెరాన్ ధర అక్షరాలా పదమూడు కోట్ల రూపాయలు. ఎంతో మోజుపడి కొనుక్కున్నాడు బ్రిటన్‌కి చెందిన వ్యాపారవేత్త అఫ్జల్ కాహ్న్.
ఆయన లక్కీ నెంబర్ ఒకటి. ఈ నెంబర్ వచ్చేలా F1 అనే నెంబర్ కావాలని కోరుకున్నాడు. కానీ ఆ నెంబర్ చాలా రేటు ఎక్కువ. చివరకు ఈ ఫ్యాన్సీ నెంబర్ ను వేలం పాటలో ఏకంగా 132 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నాడు అఫ్జల్. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇదో సెన్సేషనల్ న్యూస్ అవుతోంది.
కారు నెంబర్ కోసం ఇన్ని కోట్లా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఈ రేటులో మరో పది కార్లు కొనుక్కోవచ్చు కదా.. అని ముక్కున వేలేసుకుంటున్నారు. అదీ నిజమే.. కానీ ఏం చేస్తాం.. ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా. కందకు లేని దురద కత్తికెందుకు చెప్పండి.. అందుకే అన్నారు జిహ్వకో రుచి.. పుర్రె కో బుద్ధి అని. మన ఇండియాలోనూ ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ పిచ్చి ఉంది కానీ.. అది కోట్ల రూపాయలకు చేరలేదు లెండి.
మరింత సమాచారం తెలుసుకోండి: