నీలి రంగులో సరికొత్తగా ఆధార్ కార్డ్స్...! కానీ ఆ కార్డులు వారికీ మాత్రమే...!

Suma Kallamadi

ప్రస్తుతం దేశంలో ప్రతి మనిషికి ఉండవలిసినదానిలో ముందు వరుసలో ఉండేది ఆధార్ కార్డ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, దీనికి కారణం ఇది ఎంతో కీలకమైన డాక్యుమెంట్. ఈ కార్డు ఒక్క ఐడెంటిటీ ప్రూఫ్‌ గా మాత్రమే కాకుండానే ఇంకా ఎన్నో రకాలుగా ఈ కార్డు మనకు పనులకు పనికి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం కొన్ని స్థానాలలో పాన్ కార్డు కి బదులు ఆధార్ కార్డు ఉపయోగించొచ్చు కూడా.

 

 

మాములుగా పాన్ కార్డులను ఆదాయపు పన్ను శాఖ ఎలాగైతే జారీ చేస్తుందో, ఆధార్ కార్డును కూడా యూఐడీఏఐ కూడా అలానే ఇష్యూ చేస్తుంది. భారతదేశంలోని ఏ ఒక్క వ్యక్తి అయినా  ఎవరైనాసరే ఆధార్ కార్డు తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ కార్డులను తీసుక రాబోతుంది.

 

 

యూఐడీఏఐ ప్రస్తుతం కొత్త ఆధార్ కార్డులు జారీ చేస్తోంది. ఇవి నీలి రంగులో ఉంటాయి. వీటికి బాల్ ఆధార్ కార్డ్ అని అంటారు. అన్నట్టుగానే పేరులోనే దీని అర్థం ఉంది. ఈ నీలి రంగు ఆధార్ కార్డులు చిన్న పిల్లకు మాత్రమే ఇష్యూ చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు వయసు ఉన్న వారికి మాత్రమే ఈ ఆధార్ కార్డు ఇస్తారు. అయితే పాత కార్డులు ఉన్నాయి కదా? మరి ఈ కొత్తగా ఆధార్ కార్డులు ఎందుకు జారీ చేయాలనే ప్రశ్న ఇప్పటికే వచ్చే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వపు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పిల్లలకు కూడా అందించేందుకు మోదీ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. యూఐడీఏఐ ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది కూడా. ఈ కొత్త ఆధార్ కార్డులను దగ్గరిలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి పిల్లలకు  తీసుకోవచ్చు.

 

 

అయితే ఈ కొత్త నీలి రంగు ఆధార్ కార్డులు పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చేంత వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత ఈ కార్డుల యొక్క వాలిడిటీ ముగుస్తుంది. దీనితో మళ్లీ తర్వాత పిల్లల బయోమెట్రిక్స్‌ ను అప్‌డేట్ చేసుకోవలసి ఉంటుంది. కాగా యూఐడీఏఐ పిల్లలకు ఇష్యూ చేసే బాల ఆధార్ కార్డుకు సంబంధించి వారి నుంచి ఎలాంటి బయోమెట్రిక్స్ తీసుకోదు. దీంతో పిల్లలకు ఐదేళ్ల వచ్చిన తర్వాత మళ్లీ ఆధార్ సెంటర్‌ కి వెళ్లి వారి బయోమెట్రిక్స్‌ ని అప్‌ డేట్ చేయించుకోవలసి ఉంటుంది. లేదంటే ముందు తీసుకున్న ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: