హైకోర్టుకు వైసీపీ లేడీ ఎమ్మెల్యే... రీజన్ ఇదే...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యే హైకోర్టు మెట్లెక్కారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తూర్పుగోదావరి జిల్లాలోని అడ్డతీగలలో తన ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాడని తహశీల్దార్ ఇంటి నిర్మాణం ఆపాలని జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ధనలక్ష్మి హైకోర్టును కోరారు. 
 
ధనలక్ష్మి తాను 3 సెంట్ల స్థలాన్ని ఉదయభాస్కరరావు అనే వ్యక్తి దగ్గర నుండి కొనుగోలు చేశానని ఆ తరువాత ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అనుమతులు కూడా తీసుకున్నానని గ్రామ పంచాయతీ అనుమతుల మేరకే తాను ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని ధనలక్ష్మి పిటిషన్ లో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆ స్థలం గురించి ఫిర్యాదు ఇచ్చిందని వంతల రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనకు నోటీసులు జారీ అయ్యాయని పిటిషన్ లో పేర్కొన్నారు. 
 
హైకోర్టును తహశీల్దార్ ఇచ్చిన నోటీసును వెంటనే రద్దు చేయాలని ధనలక్ష్మి కోరారు. ధనలక్ష్మి పిటిషన్ లో ప్రతివాదులుగా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, తహశీల్దార్, ఆర్డీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శులను చేర్చారు. కోర్టు ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి తీర్పునిస్తుందో చూడాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో ధనలక్ష్మి ఎన్నికల్లో విజయం సాధించారు, 
 
2014 ఎన్నికల్లో కూడా రంపచోడవరంలో వైసీపీ పార్టీనే గెలిచినా ఎన్నికలకు సంవత్సరం ముందు అభివృద్ధి పేరు చెప్పి వంతల రాజేశ్వరి పార్టీ మారారు. వైసీపీ పార్టీ క్యాడర్ ను అంటిపెట్టుకొని ఉపాధ్యాయురాలిగా పని చేసి స్వచ్చంద పదవీ విరమణ పొందిన ధనలక్ష్మికి జగన్ టికెట్ ఇచ్చారు. టీడీపీ నుండి వంతల రాజేశ్వరి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళుతున్న ధనలక్ష్మి స్థల వివాదం కారణంగా హైకోర్టు మెట్లెక్కారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: