"జగనన్న గోరుముద్ద"ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రోజా, ఆపై విద్యార్థులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పలు పథకాలను అమలు చేస్తుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి పేరు మార్చి, ఆ పథకానికి జగనన్న గోరుముద్ద పథకంగా పేరు మార్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గం పరిధిలో నగరిలోని ఒక పాఠశాలలో తనిఖీ చేశారు. ఆమె పిల్లలకు పెడుతోన్న భోజనంలో నాణ్యతపై తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి, ఆ తర్వాత వారితో కలిసి బంతిలో కూర్చొని భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అందించే భోజన పథకానికి 'జగనన్న గోరుముద్ద'గా ఇటీవల పేరు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.
అయితే ఆ విషయం సందర్భాంగా రోజా మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు భోజనం వడ్డించిన విషయానికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం ఫేస్‌బుక్, యూట్యూబ్ చెక్కర్లు కొడుతుంది. అయితే బడి పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే రోజా 'మీరు గ్రేట్ మేడం' అంటోన్న నెటిజన్లు అభినందల జల్లు కురిపిస్తున్నారు.