చెత్త పలుకు: పీకే బాధ కంటే ఈ ఆర్కే బాధ ఎక్కువగా ఉందే...?

ఉన్నతమైన స్థానాల్లో ఉంటూ సమాజంలో సెలబ్రేటీలుగా చెలామణి అవుతుండేవారు మాట్లాడే భాష విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రభావం సమాజం పై కూడా పడుతుంది కాబట్టి. ఇక మీడియా వర్గాల్లో ఉన్నవారైతే ఆచితూచి ఏ విషయం పైనా స్పందించాలి. లేకపోతే ప్రజల నుంచి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే కొంతమంది మీడియా అధిపతులకు ఈ తరహా అవమానాలు తరచుగా ఎదురవుతున్నా వారి వ్యవహార శైలి, భాషా విధానాలను వారు మార్చుకోవడం లేదు. ఈ విషయంలో పచ్చ మీడియా అధిపతిగా పేరుపొందిన ఓ పత్రిక, ఛానల్ అధిపతి ప్రతి శుక్రవారం తన ఎడిటోరియల్ లో రాసే కొన్ని చెత్త పలుకులు చదువుతుంటే వీరికి సమాజం పైన, వీరికి ఇష్టం లేని పార్టీలు, వ్యక్తులపైన ఎంత అక్కసు ఉందో అర్ధం  అవుతోంది.


 వక్ర భాష్యంలో కథనాలను వల్లెవేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. దీంతో వీరి వ్యవహారశైలి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్ధం అయిపోతోంది. ఏపీ సీఎం జగన్, ఆయన పార్టీ వైసీపీ పై మొదటి నుంచి వ్యతిరేక భావం తోనే ఉన్న సదరు పచ్చ మీడియా అధిపతి మొన్నటి ఎడిటోరియల్ లోనూ అదే రకమైన సంపాదకీయం రాశారు. ఎవరెవరో ఏదో అనుకుంటున్నారని దాన్ని జగన్ కు ఆపాదించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీకి రాజకీయ సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారని, అనవసరంగా ఆ పార్టీని తన భుజాల మీద వేసుకొని నెగ్గించా అని, కానీ జగన్ పాలన ఈ విధంగా ఉంటుందని తాను అనుకోలేదని ఆయన బాధపడుతున్నారట.


 జగన్ ను నెగ్గించడం ద్వారా నేను చంద్రబాబుకే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం చేశాను అంటూ ఇప్పుడు తీరిగ్గా పీకే బాధ పడి పోతున్నారన్నట్టుగా సదరు చెత్త పలుకుల్లో పేర్కొన్నారు. జగన్ వల్ల అంతర్జాతీయంగా ఏపీ పరువు ప్రతిష్ట మసకబారుతున్నాయని ఆ మీడియా అధినేత పేర్కొన్నారు. అయితే ఎవరో అభిప్రాయం ఇలా ఉంది అంటూ తన సొంత అభిప్రాయాన్ని సంపాదకీయంగా రాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


మొదటి నుంచి ఇదే తరహాలో వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నా ఆయన తన వైఖరిని మార్చుకోకుండా ఇదే రకమైన చెత్త పలుకులు పలుకుతూ వస్తున్నాడు. టిడిపి ప్రభుత్వం  బాగానే లబ్దిపొందారని, ఆ విశ్వాసంతోనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: