జగ్లక్, చంగ్లక్.. గుండెలు బాదుకుంటున్న తుగ్లక్ ఆత్మ? - బాబే తుగ్లక్ అంటూ అదిరే లాజిక్ చెప్పిన బుగ్గన.. ఎలాగంటే..?

Chakravarthi Kalyan
తుగ్లక్.. తుగ్లక్.. తుగ్లక్.. ఈ పేరు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మారుమోగిపోతోంది. ఏ నాయకుడి నోట విన్నా ఈ తుగ్లక్ జపమే. ఇక ఈ నాయకుల్లో తెలుగు దేశం నేతల జాబితా మరీ ఎక్కువగా ఉంది. ఏపీ సీఎం జగన్ ను ఇటీవల ఒకనాటి ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బీన్ తుగ్లక్ తో పోలుస్తూ.. తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు. అలా ప్రతి టీడీపీ నేత నోటా ఈ తుగ్లన్ నామ జపం జరుగుతోంది.

అంతేనా.. మహ్మద్ బీన్ తుగ్లక్ లో తుగ్లక్ ను సింపుల్ గా జగన్ పేరుతో మిక్స్ చేసి జగ్లక్ అంటూ కొత్త పదం కూడా సృష్టించేశారు తెలుగు దేశం నాయకులు. అయితే వైసీపీ వారు మాత్రం ఊరుకుంటారా.. చంద్రబాబు పేరును, తుగ్లక్ పేరునూ కలిపిసి చంగ్లక్ అంటూ కొత్త రాగం ఆలపించారు. ఇచ చంద్రబాబు అయితే జగన్ ను తరచూ తుగ్లక్ తుగ్లక్ అంటూ విమర్శిస్తున్నారు.

తాజాగా బడ్జెట్ పై మాట్లాడిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా తుగ్లక్ విమర్శలు చేశారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడే తుగ్లక్ మాదిరే వ్యవహరిస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. అన్ని ఓకే చోట పెట్టి , మిగిలిన ప్రాంతాలను పట్టించుకోకుండా చేయాలని ప్రయత్నించిన వ్యక్తి తుగ్గక్కా ? లేక అందరిని సమానంగా చూడాలనుకునే వ్యక్తి తుగ్లకా? అని ఆయన ప్రశ్నించారు.

మద్యలో ఉండాలని రాజధాని పెట్టింది తుగ్లక్ అని, అలాగే చంద్రబాబు కూడా తుగ్లక్ మాదిరి సెంటర్ లో పెట్టాలని అనుకున్నారని ఆయన ఎద్దేవ చేశారు. ఆంద్రప్రదేశ్ లో ప్రతి ఇరవై ఏళ్ల కోసారి ప్రాంతీయ అసమానతలపై ఆందోళనలు వస్తున్నాయని, అది సంక్షోభంగా మారుతోందని, అది జరగరాదని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆయా ఆఫీస్ లను వేర్వేరు చోట పెట్టాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

చంద్రబాబు తొమ్మిది నగరాలను అమరావతి ప్రాంతంలో పెడతానని అన్నారని, అన్నిఓకే చోట పెడితే శ్రీకాకుళం వంటి వెనుకబడిన ప్రాంతాలు ఏమైపోవాలని బుగ్గన ప్రశ్నించారు.సో.. ఇప్పుడు బుగ్గన చెప్పేదాంట్లోనూ లాజిక్ ఉంది. అయితే ఇలా ఈ రెండు పార్టీల నాయకులు తన పేరు బద్నాం చేస్తున్నారని బహుశా తుగ్లక్ ఆత్మ క్షోభిస్తుందేమో కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: