బాబోరు చెప్పినట్టు.. ఈ లక్ష్మీ నారాయణుడు నిజంగా హీరోనేనా ?

Reddy P Rajasekhar

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నేత మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేసి ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనసేన పార్టీలో నెంబర్ 2గా పేరు తెచ్చుకోవటంతో పాటు మేధావి వర్గంగా పేరుగాంచిన లక్ష్మీనారాయణ జనసేన పార్టీ అభివృద్ధికి పలు సూచనలు, సలహాలను ఇచ్చేవారు. ఇలాంటి కీలక నేత జనసేన పార్టీకి రాజీనామా చేయడాన్ని జనసేన పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. 
 
నిజానికి గతంలో కూడా ఎందరో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు రాజకీయాల్లోకి వచ్చి ప్రముఖ పార్టీల నుండి పోటీ చేసినా రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ జగన్ కేసుల విచారణలో కీలకంగా వ్యవహరించటంతో లక్ష్మీ నారాయణకు ఏపీలో మంచి గుర్తింపు వచ్చింది. విశాఖ నుండి 2019లో ఎంపీగా పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం ప్రభావంతో లక్ష్మీ నారాయణ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 
 
గతంలో చంద్రబాబు లక్ష్మీనారాయణ హీరో అనే విధంగా ప్రశంసించారు. సీబీఐ జేడీగా జగన్ కేసులను లక్ష్మీనారాయణ దర్యాప్తు జరిపారని లక్ష్మీనారాయణ టీడీపీలో చేరితే తప్పేంటని గతంలో చంద్రబాబు చెప్పారు. 2019 ఎన్నికల ముందు లక్ష్మీనారాయణని టీడీపీలో చేర్చుకోవాలని జేడీ లక్ష్మీ నారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరితే తప్పేంటిని చంద్రబాబు వైసీపీని ప్రశ్నించారు. నిజానికి లక్ష్మీనారాయణ టీడీపీలోనే చేరాల్సి ఉన్నా చంద్రబాబు సూచనల మేరకే జనసేనలో చేరాడనే ఆరోపణలు ఉన్నాయి.
 
లక్ష్మీనారాయణను చంద్రబాబు హీరో అని ప్రశంసించినప్పటికీ రాజకీయాల్లో మాత్రం జేడీ లక్ష్మీ నారాయణ హీరో కాలేకపోయారని చెప్పాలి. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించినా రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు, పదవులు అనుభవించకుండానే లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. సీబీఐ జేడీగా ఒక వెలుగు వెలిగిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మాత్రం హీరో కాలేకపోయారనే చెప్పాలి. లక్ష్మీనారాయణ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టే అని తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: