బాల‌య్య విష‌యంలో సీనియ‌ర్ల కంప్లైంట్‌... బాబుపై గుస్సా...!

Reddy P Rajasekhar

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ప్రకటన చేసిన రోజు నుండి జగన్ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో జరిగిన రైతుల దీక్షలో పాల్గొని రైతులకు మద్దతు తెలపటంతో పాటు జోలె పట్టుకొని విరాళాలు కూడా సేకరించారు. 
 
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మీడియా ముందుకు వచ్చి జగన్ పై, వైసీపీ నాయకులపై, మూడు రాజధానుల ప్రకటనపై ఎన్ని విమర్శలు చేయాలో అన్నీ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత, ఇతర నేతలు ఇన్ని విమర్శలు చేసినా బాలయ్య మాత్రం జగన్ పై కానీ, మూడు రాజధానుల ప్రకటన గురించి కానీ ఎటువంటి విమర్శలు వ్యక్తం చేయలేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు చంద్రబాబుతో బాలయ్యతో ఒక్క ప్రకటన అయినా చేయించలేరా..? అని ప్రశ్నించినట్టు సమాచారం. 
 
తాము ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ పై, జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై, శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపటంపై విమర్శలు చేస్తున్నామని సీనియర్ ఎన్టీయార్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాంటి సమయంలో వైసీపీపై, జగన్ నిర్ణయాలపై విమర్శలు చేస్తే టీడీపీకి మైలేజ్ వస్తుందని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందని బాలయ్య మాట్లాడటానికి ఇదే సరైన సమయానికి బాలయ్యతో మాట్లాడించకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబుపై సీనియర్లు గుస్సా అయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వైసీపీపై, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై విమర్శలు చేస్తే టీడీపీ కార్యకర్తల్లో, బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని అది పార్టీకి మేలు చేస్తుందని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సీనియర్లు ఇచ్చిన ఫిర్యాదును బాబు పరిగణనలోని తీసుకొని బాలయ్యతో వైసీపీపై, వైసీపీ నిర్ణయాలపై విమర్శలు చేయిస్తాడో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: