వైసీపీ చింత‌మ‌నేనికి అదో ర‌కం చెక్ పెట్టిన జ‌గ‌న్‌..?

నేనే రాజు, నేనే మంత్రి, నేనే సర్వస్వం అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం నడిచింది. ఆయన నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లో నిలుస్తూ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. అయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చింతమనేని కంట్రోల్ చేయడం మానేసి వెనకేసుకొచ్చారు. ఫలితంగా టిడిపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నాయకులను కూడా చింతమనేని ఇబ్బందులు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చింతమనేని బాధితులంతా పోలీస్ స్టేషన్ కు కోర్టుకు సాక్షాలతో సహా వెళ్లడం, ఆయన అరెస్టు కావడం ఇవన్నీ జరిగిపోయాయి.


 ఈయన సంగతి పక్కన పెడితే ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ లో కూడా చింతమనేని తరహాలో రాజకీయాలు చేస్తున్న ఓ కీలక వ్యక్తి ని జగన్ పిలిచి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన చేసిన ఆగడాలపై సాక్షాలతో సహా జగన్ కు చేరడంతో ఆయన పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ ఈ విధంగా నొప్పి గా మారడంతో ఆయనకు పెట్టేందుకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సునీతను వైసీపీలో తీసుకొని యాక్టివ్ చేయాలని జగన్ భావిస్తున్నారట. చీరాల‌లో ప‌ద్మశాలీ వ‌ర్గం ఓట‌ర్లు 70 వేల వ‌ర‌కు ఉన్నారు. సునీత ఆ వ‌ర్గానికి చెందిన వారే.


 ఆమంచి వర్గం అయిన కాపు వ‌ర్గం ఓట‌ర్లు అక్కడ త‌క్కువే అయినా ఆయ‌న రెండు సార్లు గెలిచారు. ఇక చీరాల‌లో ఆమంచికి చెక్ పెట్టేందుకే జ‌గ‌న్ సునీత‌ను పార్టీలో చేర్చుకున్నార‌నే వైసీపీ వ‌ర్గాలు కూడా ధృవీక‌రిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి ఆ మనిషికి టికెట్ దక్కడం కష్టమవుతుందనే వాదన తెరమీదకు వస్తోంది. అదీ  కాకుండా ఆమంచి రాజకీయ దూకుడుకు కళ్లెం వేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని జగన్ భావిస్తూ ఉండడంతో ఈ తరహా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: