స్టార్ హీరో వాటా అక్షరాలా 700కోట్ల రూపాయలు..!

NAGARJUNA NAKKA

మొత్తం మూడు వేలకోట్లు కలెక్షన్లు, ఆ స్టార్ హీరో వాటా 700కోట్లు. బీటౌన్ కిలాడీ స్టార్ అక్షయ్ కుమార్ గత ఏడాది క్రియేట్ చేసిన గ్రేట్ రికార్డ్. ఈ రికార్డే ఈ బీటౌన్ స్టార్ ని ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలబెట్టింది. ఈ ఇయర్ కూడా బాక్సాఫీస్ వద్ద ట్వంటీ ట్వంటీ ఆడటానికి రెడీ అవుతున్నాడు. 

 

లాస్ట్ ఇయర్ లో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హవా కొనసాగింది. ఈ కిలాడీ స్టార్ నటించిన నాలుగు సినిమాలు బీటౌన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. గతేడాది బాలీవుడ్ వద్ద సినిమాలు 3వేల కోట్లు వసూలు చేస్తే అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలు 700కోట్లు దక్కించుకున్నాయి. దీన్ని బట్టే 2019లో బాలీవుడ్ లో అక్షయ్ నామసంవత్సరంగా సాగిందనేది అర్థమవుతోంది. 

 

లాస్ట్ ఇయర్ విడుదలైన అక్షయ్ కుమార్, కేసరి, మిషన్ మంగళ్ హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూస్ సినిమాలు 700కోట్లకు పైగానే వసూళ్లు చేశాయి. ఒకే ఏడాదిలో నాలుగు హిట్స్ అందుకొని అక్షయ్ కుమార్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో అమీర్ ఖాన్ దంగల్ చిత్రంతో రెండువేల కోట్ల రూపాయలను వసూళ్లు చేసి రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ ఒకే ఏడాదిలో నాలుగు సక్సెస్ లు కొట్టిన రికార్డ్ మాత్రం కేవలం అక్షయ్ కుమార్ కే దక్కింది. 

 

లాస్ట్ ఇయర్ నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్ ఈ ఏడాది కూడా నాలుగు సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్యవంశీ మార్చ్ లో రిలీజ్ కానుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నటిస్తున్న కాంచన రిమేక్ లక్ష్మీ బాంబ్ ను మే నెలలో విడుదల చేయనున్నాడు. మరో సినిమా వృథ్వీరాజ్ అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ట్వంటీ ట్వంటీలో కూడా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హవా కొనసాగేలా కనిపిస్తోంది. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: