టీడీపీలో మరో విషాదం... టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూత.. !

Reddy P Rajasekhar

2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నేతల వరుస వరుణాలు టీడీపీలో విషాదం నింపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కోడెల శివప్రసాద్ రావు, చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ మరణాలు మరవకముందే తెలుగుదేశం పార్టీ కీలక నేత బడేటి బుజ్జి గుండెపోటుతో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి తెల్లవారుజామున 2.30 గంట సమయంలో గుండెపోటు వచ్చింది. 
 
బడేటి బుజ్జి కుటుంబ సభ్యులు బుజ్జిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే బుజ్జి తుదిశ్వాస విడిచాడని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. బుజ్జి 2014 నుండి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యేగా పని చేశారు. బడేటి బుజ్జి అసలు పేరు బడేటి కోట రామారావు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా, ఛైర్మన్ గా పని చేసిన బుజ్జి సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 
 
2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బుజ్జి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీకి బడేటి బుజ్జి మృతి తీరని లోటు అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుజ్జి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాయి. బడేటి బుజ్జి ఎస్వీ రంగారావుకు స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు బుజ్జి మరణం విషయం తెలిసిన వెంటనే ఏలూరులోని బుజ్జి నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బడేటి బుజ్జి మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్ లో బడేటి బుజ్జి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని బుజ్జి కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. బడేటి బుజ్జి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే చేతిలో నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: