జగన్ కు చిరంజీవి మద్దతు వెనుక బలమైన కారణం ఇదేనా.?

praveen

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతైనా అవసరం... రాష్ట్రంలో అభివృద్ధి ఒకేచోట ఆగిపోకుండా రాష్ట్రం మొత్తం జరగాలి.. దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానిల నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానిల నిర్మాణం అంటూ జగన్ ప్రజాధనాన్ని వృధా చేయడానికి డ్రామా ఆడుతున్నారని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 

 

 

 మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై రాజధాని రైతులు ఒకసారిగా  భగ్గుమన్నారు. రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి మార్చొద్దు అంటూ డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే జగన్ 3 రాజధానిలో నిర్ణయానికి సినీ నటుడు చిరంజీవి మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరగడానికి జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ సమర్థించారు. అయితే ఓ వైపు జగన్ నిర్ణయాన్ని తమ్ముడు పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ ఉంటే.. మరోవైపు అన్న చిరంజీవి మాత్రం సమర్ధించడం ఆసక్తికరంగా మారింది. 

 

 

 

 అయితే జగన్ 3 రాజధానిల నిర్ణయానికి చిరంజీవి మద్దతు పలకడం వెనుక బలమైన కారణమే ఉందంటూ చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు రాజ్యసభ సీటు ఆశించి చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది. వైజాగ్ లో చిరంజీవి ఓ సినీ స్టూడియో పెట్టే ఆలోచనలో ఉన్నారని... దాని కోసం ప్రభుత్వం నుంచి సహకారం కావాల్సి ఉన్నందున జగన్ ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయానికి చిరంజీవి మద్దతు తెలిపారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా చిరంజీవికి వైజాగ్ చుట్టుప్రక్కల భూములు ఉన్నాయని దీంతో వైజాగ్ లో రాజధాని ఏర్పడితే భూములకు మంచి ధరలు  వస్తాయని భావించే చిరంజీవి మద్దతు తెలుపుతున్నారు అంటూ వార్తలు ప్రచురితం అవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: