భార్యను క్రికెట్ బ్యాట్ తో అతిదారుణంగా కొట్టి చంపిన భర్త.. కారణం ఇదే.?

praveen

ఈ రోజుల్లో సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న విషయాలకు కక్ష పెంచుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు జనాలు . రోజుకో హత్య తెరమీదికి వస్తూనే ఉంది. చిన్న చిన్న గొడవలకే కోపోద్రిక్తులై మనుషుల ప్రాణాలు హరించే చేస్తున్నారు. క్షణికావేశంలో చేసిన పనికి ఆ తర్వాత కటకటాల వెనుకకు వెళ్లి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నేటి సమాజంలో రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. క్షణికావేశంలో కోపోద్రిక్తులైన మనుషులు సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. భార్యభర్తల మధ్య కూడా ఈ మధ్య చిన్న చిన్న గొడవలకి  ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 

 

 

 

 అయితే ఇక్కడ ఇద్దరు దంపతులకు పెళ్లి జరిగి కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇద్దరు దంపతులు మధ్య  గొడవలు జరగడం మొదలవుతాయి. ఇద్దరు ఏదో ఒక విషయంలో తరచూ గొడవలు పడుతూనే ఉండేవారు. నిన్న రాత్రి  సమయంలో ఇలాగే గొడవ జరుగుతుండగా.. గొడవ చిలికి చిలికి గాలి వానలా తయారైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త క్షణికావేశంలో క్రికెట్ బ్యాట్ తో భార్య తల పగలగొట్టాడు. దీంతో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక భార్యను చంపిన భర్త గా ఆ వ్యక్తి కటకటాలపాలయ్యాడు.గుంటూరు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లో ఈ దారుణం చోటు చేసుకుంది. 

 

 

 

 నరసరావుపేటలో ముస్తఫా హయత్తున్నీసా  దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. చిన్న విషయానికే ఈ భార్యభర్తలిద్దరు తరచూ గొడవలు పడుతూ ఉండేవారు.ఈ క్రమంలోనే  నిన్న రాత్రి కూడా  భార్యాభర్తల మధ్య ఏదో విషయమై గొడవ  ఏర్పడింది. భార్యభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవ కాస్త చిలికిచిలికి గాలివానలా అయ్యి... ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది . దీంతో తరచూ గొడవలు పడుతున్నా భార్యపై భర్త కోపంతో ఊగిపోయాడు. దీంతో క్షణికావేశంలో భార్య తలపై క్రికెట్ బ్యాట్ తో బలంగా కొట్టాడు. అయితే క్రికెట్ బ్యాట్ తో తలపై బలంగా కొట్టడంతో భార్య తల పగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది  భార్య హయతున్నీసా . రక్తపు మడుగులోనే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సదరు భర్త ను అదుపులోకి తీసుకుని కటకటాల వెనుకకు పంపించారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: