దిశ నిందితుల శవాలకు కాస్ట్ లీ...!

NAGARJUNA NAKKA

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. నిజానిజాలు తేల్చడానికి విచారణమ కమిషన్ ను నియమించింది. దీంతో సుప్రీం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ డెడ్ బాడీలు భద్రపరచాల్సిన బాధ్యత అధికారులపై పడింది. దీంతో మృతదేహాలు పాడవకుండా కాస్ట్ లీ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. 

 

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఎన్‌కౌంటర్ పై ఎన్.హెచ్.ఆర్.సి ఫిర్యాదుతో నలుగురు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాలతో నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నప్పుడే డెడ్ బాడీ డీకంపోజ్ అవుతున్నాయని త్వరగా అంత్యక్రియలు అనుమతి ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే ఎన్.హెచ్.ఆర్.సి విచారణతో అది కాస్త కుదరలేదు. దీంతో నలుగురి డెడ్ బాడీలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

 

గాంధీ ఆస్పత్రి మార్చురీలోని నిందితులు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలు భద్రపరిచారు. అయితే ఇవి పాడవ్వకుండా ఉండటానికి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏకంగా 7,500 రూపాయల విలువైన ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఈ ఇంజక్షన్లు ఇస్తూ డెడ్ బాడీలు భద్రపరచాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి నాలుగు మృతదేహాలకు ఈ ఇంజక్షన్ లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇంజక్షన్లు తెప్పించి ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల దాదాపు నాలుగు నెలల పాటు డెడ్ బాడీలు చెడిపోకుండా ఉంటాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు డెడ్ బాడీలు గాంధీ ఆస్పత్రిలోనే ఉండనున్నాయి. దిశ నిందితుల బంధువులు ఇప్పటికే తమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. తమకు శవాలు అప్పగించే ముందు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దిశ నిందితుల మృతదేహాలకు కాస్ట్ లీ ఇంజెక్షన్లు వాడటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: