అదిగోపులి అంటే జబ్బెడు తోక అని అన్నట్టుంది చిరంజీవి పరిస్థితి. కేంద్ర మంత్రివర్గం విస్తరనో,మార్పులో,లేక రాష్ట్ర కాంగ్రేస్ పునర్ వ్యవస్థీకరణ మాటో వినవచ్చినప్పుడల్లా చిరంజీవి మాట తెరపైకి రావడం, పదవి ఖాయమని కొన్నాళ్లు చర్చజరగడం,ఆతర్వాత ...ఏంటో చెప్పక్కర్లేదు.
ఇప్పుడు మళ్లీ అదే మొదలైంది. సోనియా విదేశాలనుంచి వచ్చిందట. రానున్న ఎన్నికల కోసం కేంద్రంలో మంత్రివర్గంలోను, పార్టీపదవుల్లోను భారి మార్పులు చేయనున్నారట. చిరంజీవికి మంత్రిపదవి ఖాయమట. ఇవి తాజాగా వినిపిస్థున్న మాటలు, ఈమాటలు కొత్తేమి కాదు, పలుసార్లు చెవులు చిల్లులు పడేలా గోలచేసినవే. అయినా అవేవి నిజాలు కాలేదు. అలా అని ఎప్పుడు ఒకేలా జరుగుతుందని ఎలా అంటాం కాబట్టి ఈసారి చిరంజీవి అంతరంగం ‘ కలలే నిజాలవునా ఈనాటికి’ అని కూని రాగాలు తీస్తోందట. పైగా ఈసారి కొత్తగా వినిపిస్థున్నదేమిటంటే కేంద్రమంత్రి వర్గం మార్పుల్లో మన రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారట. అందుకే వేరేవారి మాట ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం మంత్రిపీఠం ఎక్కనున్నారట. ఏముంది ఇన్నాళ్లు ఎదిరిచూసిన మనం ఇప్పుడు కూడా ఆశాభావంతోనే వేచిచూద్దాం.
మరింత సమాచారం తెలుసుకోండి: