మోగిన నగారా; 50లక్షల మందితో తెలంగాణ మార్చ్

 హైదరాబాద్:ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఈ నెల 30న నిర్వహిస్తోన్న తెలంగాణ మార్చ్ ఛలో హైదరాబాద్ ఉద్యమ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ నగారాను మోగించింది. ప్రత్యేక తెలంగాణ ఇస్తరా, ఇవ్వరా అని అడగటానికి టీజేఏసీ బయలు దేరింది. తెలంగాణ సన్నాహాక కార్యక్రమం ప్రారంభమైంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ మార్చ్కు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేకాదు, తెలంగాణ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి కూడా తెలంగాణ సమాజమంతా సిద్ధమైంది. తెలంగాణ మార్చ్ రోజున యావత్ తెలంగాణ నుంచీ కనీసం 50లక్షల మంది హైదరాబాద్ వచ్చే విధంగా ఇప్పటికే టీజేఏసీ ఏర్పాట్లను చేసుకుంది. తెలంగాణ ఉద్యమం శాంతి భద్రతల సమస్యగా చూడొద్దనీ టీజేఏసీ కోరుతోంది.సీమాంధ్ర పాలకుల వల్లనే తెలంగాణలో ఆశాంతి చెలరేగుతోందనీ టీజేఏసీ ఆరోపిస్తోంది. తెలంగాణను సాధించే దిశగా తాము శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం అణిచివేయాలని చూస్తే అది ఎగిసిపడుతుందనీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ను జయప్ర దం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ కూడా తెలంగాణ రాష్ర్టం కోసంమరో పోరాటానికి సిద్ధం కావాలంటోంది. ఛలో హైదరాబాద్ పేరుతో ఈ నెల11న చేపట్టనున్న తెలంగాణ మహాధర్నా గోడపత్రికను కూడా ఆవిష్కరించారు. మొత్తానికి ఈ దఫా తెలంగాణ ఉద్యమంతో తెలంగాణవాదులంతా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.  ఇది అంతం కాదు, ఆరంభం అనే నినాదంతో తెలంగాణ వాదులంతా ముందుకెళ్తున్నారు. అయితే, ఉద్యమాన్ని అణిచి వేయాలనీ చూస్తే ఉద్యమం మరింత ఎగిసిపడుతుందనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలనీ హెచ్చరిస్తున్నారు. మొత్తానికి లక్షలాది మంది ప్రజలతోఈ నెల 30న తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: