అక్కడక్కడ వానలు

 హైదరాబాద్: ఆదివారం రాత్రి రాష్ర్టంలోని పలు ప్రాంతాలలో ఓ మెస్తరు వర్షం కురిశాయి. సంగారెడ్డి, పటాన్ చెరువు, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఒంగోలు, ఉబయగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. రాజధానిలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఫలితంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పలు ప్రాంతాలలో కరంటు సరఫరా కూడా నిలిచిపోయింది. దీనితో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షం కారణంగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అతలాకుతలంగా మారింది. ముందస్తుగా హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు ప్రజలు రోడ్లపై నడిచేప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మ్యాన్యువల్ వ్యవస్థ సరిగ్గా లేని చోట అధికారులు హెల్ప్లైన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. వర్షా కాలం ప్రారంభమై 24రోజులు దాటుతోంది. ఇప్పుడు కూడా రాష్ర్టమంతటా వర్షాలు లేవు. వానదేవుడు ఏవో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని వానలు కురిపించనట్లుగా వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: