
ఇక నుంచి పెళ్లి చేసుకోవాలంటే ఆ పరీక్ష పాస్ అవ్వాల్సిందే.?
మామూలుగా అయితే మనం పరీక్షలు ఎందుకు రాస్తాం.. ఏదైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా చదువులు చదువుతున్నప్పుడు... కానీ పెళ్లి కోసం ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడం అనే మాట విన్నారు. పెళ్లి కోసం ఎగ్జామ్ రాయడం ఏంటి... అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చి ... అమ్మాయి అబ్బాయి కుటుంబాలు ఒప్పుకుంటే చాలు పెళ్ళి చేసేయొచ్చు అంటారా. ఇక నుంచి అలాంటిది మాత్రం కుదరదు. పెళ్లి చేసుకోవాలంటే కోర్సు చేసి పాస్ కావాలని నిబంధన పెట్టింది ప్రభుత్వం. పరీక్ష రాసి ఉత్తీర్ణులైన తర్వాత ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందంటూ తేల్చి చెప్పేసింది. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా... మనదేశంలో కాదులెండి ఇండోనేషియాలో. ఇండోనేషియాలో ప్రభుత్వం ఈ కొత్త నిబంధన తీసుకువచ్చింది. పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం సూచించిన కోర్సు చదివి అందులో పాసై ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ పొందిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే నిబంధన పెట్టింది... అసలు వివరాలు తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.
ఇండోనేషియాలో ప్రత్యేకంగా పెళ్లి చేసుకుని వారి కోసం మూడు నెలల కోర్సును ప్రవేశపెట్టింది ప్రభుత్వం. పెళ్లి చేసుకునే ముందు అందరూ ఈ ప్రత్యేకమైన మూడు నెలల కోర్సును పూర్తిచేసి పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసి పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ జారీ చేస్తుంది. సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే పెళ్లి చేసుకోవాలనే నిబంధన పెట్టింది. అయితే ఈ మూడు నెలల కోర్సును ఉచితంగానే అందిస్తుంది ఇండోనేషియా ప్రభుత్వం. అయితే పెళ్లి చేసుకోబోయే వారికి ఈ మూడు నెలల కోర్సులో సంతానోత్పత్తి, అనారోగ్య నివారణ, పిల్లల సంరక్షణ వంటి అంశాలపై చిట్కాలను నేర్పిస్తారు. పెళ్లంటే ఆలుమగలు కలవడమే కాదు... పిల్లలను పోషించడం, ఆరోగ్య సంరక్షణ... కుటుంబ పోసిన వంటివి చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటివి ఈ కోర్సులో నేర్పించడానికి ఇండోనేషియా ప్రభుత్వం ఈ కొత్త కోర్సును ప్రవేశపెటిందట. ఇందులో ఉత్తీర్ణత పొందిన వారికి మాత్రమే పెళ్ళి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది.
అయితే 2020 సంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ కల్చర్ విభాగం ప్రకటించండి. ఈ కోర్సులు పరీక్షలు ఏమీ లేవు నేను పెళ్లి చేసుకుంటానంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పెళ్లి చేసుకున్నారే అనుకోండి వారిపై కఠిన చర్యలు తప్పవు. అంతేకాకుండా ఈ కోర్సులు పూర్తిచేసి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఈ మూడు నెలల కోర్సు పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. ఇకనుంచి ఇండోనేషియాలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు ముందుగా కోర్సు చదివేందుకు సిద్ధంగా ఉండాలన్నమాట.