అసదుద్దీన్ ని సరిగ్గా “ఢీ” కొట్టగల దమ్మున్న వ్యక్తి “బాబుల్” మాత్రమే!

రజాకార్ల వారసుడు సలావుద్దీన్ ఒవైసీ పుత్రరత్నాలు అసదుద్దిన్ ఒవైసీ అక్బరుద్దీన్ ఒవైసీలు – మతమౌఢ్యాన్ని పెంచి పోషించటంలో వీరికి తిరుగులెదంటారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యవహారం చాలా ప్రత్యేకం. ఎక్కడికెళ్లినా, ఏదో ఒక మత లేదా రాజకీయ వివాదం చెలరేగేలా వ్యవహరించటం ఈ యన సహజ గుణం. ఆలాగే - ఏళ్ల తరబడి వివాదంగా మారిపోయిన అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 


ఇక అక్బరుద్దీన్ ఒవైసీ విషయానికి వస్తే 24 డిసెంబరు 2012లో ఆదిలాబాదు జిల్లాలోని నిర్మల్ పట్టణంలో ఆయన చేసిన ప్రసంగం హిందువుల పట్ల అభ్యంతరకర అసభ్యకరమై తీవ్ర వివాదాలకు దారితీసినిది. ఈ ప్రసంగం కారణంగా  ఇతడిపై కేసు నమోదయింది. పోలీసుల వైఖరిని తూర్పారబట్టాడు. తరచూ ఈ సోదరులు హిందువు ల వ్యతిరేఖులుగా వ్యవహరిస్తూ మతమౌఢ్యాన్ని ప్రోత్సహిస్తూ కూడా లౌకికత్వం గురించి తెగ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. 


అయితే అయోధ్య వివాదంలో ప్రతివాదులుగా ఉన్న ముస్లిం సంస్థలు, మతసామరస్యాన్ని కాపాడే ఉద్దేశంలో కోర్టు తీర్పును గౌరవిస్తుంటే, అసద్ మాత్రం సుప్రీం తీర్పు తమకు సమ్మతం కాదని తనదైన శైలిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన వాదనను వినిపించి సంచలనం రేకెత్తించారు. 

ఊరంతా ఒక దారైతే ఉలిపిరికట్టెదో దారి అన్నట్లు దేశం మొత్తం ఒక  దారిలో వెళుతుంటే, అసద్ ఒక్కరే విభిన్న మార్గంలో వెళుతున్నారని ‘బాబుల్ సుప్రియో’ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయాయి. అంతేకాకుండా అసద్ ను ఇస్లాం మత బోధకుడు గానే కాకుండా మత విధ్వేషాలు రెచ్చగొట్టే విషయంలో అందరి కంటే ఒక మెట్టు పైనే నిలిచిన జకీర్ నాయక్ తో పోల్చారు. జకీర్‌ నాయక్‌ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్న విషయం తెలిసిందే. 


అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమకు, తమ మసీదును తిరిగి ఇవ్వాలని అసద్ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో  ఈ క్రమంలో అసద్ఉద్దీన్ కు అసలు సిసలు ప్రత్యర్థిగా నిజంగా కొరకరాని కొయ్యగా మారాడు. బాబుల్ సుప్రియో చేసిన వ్యాఖ్యలు అసద్ఉద్దీన్ ను ఇతర ముస్లిం సంస్థల వారూ సైతం వేలెత్తి చూపేలా ఇరకాటంలో పడేశాయనే చెప్పక తప్పదు. జకీర్ నాయక్ దేశంలో ఏ మేర మత విధ్వేష సంచలనాలు రేకెత్తించారో మనందరికీ తెలిసిందే. 


ఇస్లామిక్ మత బోధనలు చేసేందుకు ఒక టీవీ ఛానెల్ ను ఏర్పాటు చేసుకున్న జకీర్ నాయక్, ఇస్లామిక్ యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీంతో ఆయనపై కేసులు నమోదు కాగా, దేశం వదిలి పారిపోయారు. ఇలాంటి జకీర్ నాయక్ ను అసద్ గుర్తు చేస్తున్నారంటూ అంటూ బాబుల్ చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనమే. అసద్ కూడా దాదాపు జరీక్ లానే మారిపోయారని అనుమానం లేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా జకీర్ ను కూడా మించిపోయేలా అసద్ వ్యవహరిస్తున్నారని కూడా బాబుల్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసద్ కు బాబుల్ సుప్రియో ఇప్పుడు అసలు సిసలు ప్రత్యర్థిగా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: