కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి సంఘటన అందరిని కలకలం రేపింది. మాజీమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన తన్వీర్ సైత్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. తాజాగా మైసూరులో జరిగిన వివాహానికి హజరైన తన్వీర్‌పై పర్హాన్ పాషా అనే యువకుడు కత్తితో హత్య యత్నం చేయడానికి ప్రయత్నం చేసాడు.
ఎమ్మెల్యే అనుచరులు, బాడీగార్డులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పకించడం జరిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఎమ్మెల్యేలను వెంటనే కొలంబియా ఆసియా ఆస్పత్రికి హుటా హుటిగా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలియచేయడం జరిగింది.
ఇక మరో వైపు ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన పాషాను ఉదయగిరి ప్రాంతానికి చెందిన కళాకారుడు అని పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో తన ఉద్యోగం కోసం ఎమ్మెల్యేను రెండు మూడుసార్లు కలవడం జరిగింది, కానీ ఎన్నిసార్లు తిరిగినా ఉద్యోగం రావడం లేదన్న ఆక్రోశంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడు అని పలు అనుమానాలు వేలాడవుతున్నాయి. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఆ నిందితుడిని విచారణ చేయడం జరుగుతుంది. ఈ దాడి వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ దర్యాప్తులు కూడా చేస్తున్నారు పోలీసులు.
ఇక ఎమ్మెల్యే గురించి.. తన్వీర్ ప్రస్తుతం నరసింహారాజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. 2016లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన రాయ్‌చూర్‌లో నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని సెల్‌ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ మీడియా అడ్డంగా కూడా దొరికిపోవడం జరిగింది. అప్పట్లో ఈ సంఘటన కన్నడ రాజకీయాల్లో బాగా కలకలం రేపింది. తన్వీర్‌పై హత్యాయత్నం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని తన్వీర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు.