ఇప్పుడు రాష్ర్ట రాజకీయ నాయకులంతా ఢిల్లీలో మకాం వేశారు. పనిలో పనిగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఢిల్లీకి చేరుకుని బీసీ లాబీయింగ్ మోదలు పెట్టారు. ఇటీవల రాష్ర్టానికి సంబంధించిన రాజకీయ సమీకరణలు వేగంగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటాపోటిగా వ్యూహ రచన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే అందరికంటే ఏ విషయంలోనైనా స్పష్టత ఇవ్వని బాబు ప్రతి విషయంపై ఇప్పుడు స్పష్టమైన నిర్ణయాలతో ఓటు బ్యాంక్ ను పెంచుకునేలా ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో పార్టీ చాలా బలహీన పడడంతో అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ వర్గంలోని ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు బహిరంగంగా నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు మద్ధతు తెలిపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుంటే జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చట్టసభలో బీసీల రిజర్వేషన్ కార్య క్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన బాబు అక్కడ సైతం రాజకీయ చతురతను చాటుతున్నారు.
ఏసమయంలో ఏమవుతుందోనని పనిలోపనిగా రాష్ర్టపతిని కలిశారు. దీంతోపాటు బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. బీసీలకు చట్టసభలో మూడోవంతు రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ అమలు చేయాలని దీనికి రెండు నెలల సమయం ఇస్తున్నామని ఆయన ప్రధానికి సూచించారు. కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమం తప్పదిని తేల్చిచెప్పేశారు. అంతే కాకుండా బీసీ డిక్లరేషన్ను జాతీయా స్థాయి ఎజెండాగా చేస్తామని బాబు చెప్పడం చూస్తుంటే జాతీయ స్థాయిలో సైతం తన సత్తాను చాటుకునేందు యత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట డిమాండ్ ఢిల్లీ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతున్నతెలంగాణ అంశంపైకూడ పార్టీ వర్గాలతో చర్చించి స్పష్టత ఇస్తానని చెప్తున్నాడు. గతంలో తిరుగు లేని నాయకునిగా పేరుతెచ్చుకున్న బాబు తిరిగి ఆ పేరును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలోని ప్రముఖ నాయకులను కలవడం కూడా ఇందులోని భాగమే.
బాబు పాద యాత్ర...
120 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాదాపు 120 రోజుల్లో 2.500కిలో మీటర్ల మేరకు పాదయాత్రకు చేయనున్నారు. దీనిపై పార్టీలోని సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారని విశ్వనీయ సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: