లోకేష్ కూడా ధైర్యం చేశారే ?

Vijaya

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఐదు నెలలకు నారావారి పుత్రరత్నం లోకేష్ ధైర్యం చేశారు. అదికూడా ఇసుక కొరత తీవ్రంగా ఉందనే ఆరోపణలపై నారా లోకేష్ ఒక్కరోజు దీక్ష పేరుతో మొదటిసారి  రోడ్డుమీదకొచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటంతో పాటు తాను కూడా మంగళగిరిలో ఓడిపోయిన దగ్గర నుండి జనాలకు లోకేష్ మొహం చూపించలేక ట్విట్టర్లో మాత్రమే కనిపిస్తున్నారు.

 

ప్రభుత్వం మీద వ్యవతిరేకంగా పిచ్చి  పోస్టులు పెడుతూ అదే బ్రహ్మాండమైన ఆందోళనలు, నిరసనలని మురిసిపోతున్నారు. పైగా పెడుతున్న పోస్టులు కూడా తప్పుడివే. అందుకనే నెటిజన్లు లోకేష్ నుండి వస్తున్న పోస్టులపై భీకరంగా ట్రోలింగ్ చేస్తుంటారు. ట్విట్టర్లోనే తప్పుడు పోస్టులు పెడుతూ అభాసుపాలవుతున్న లోకేష్ ఇక నేరుగా జనాల్లోకి వచ్చే ధైర్యం చేయలేదు.

 

అందుకనే ఇంతకాలం జనాలకు మొహం చాటేశారు. అలాంటిది హఠాత్తుగా విజయవాడలో లోకేష్ దీక్ష చేయటమంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. ముందు తెలుగుదేశంపార్టీ నేతలే లోకేష్ దీక్ష చేస్తారన్న విషయాన్ని నమ్మలేదు. తర్వాత దీక్ష విషయాన్ని లోకేషే స్వయంగా చెప్పటంతో విజయవాడ నేతలు అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు లేండి.

 

ఇంతకాలం జనాల్లోకి ఎందుకు రాలేదంటే ఏమి మాట్లాడుతారో తెలీదు కాబట్టి నవ్వుల పాలవ్వటం ఇష్టం లేకే అని సమాధానం వస్తుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి ప్రత్యేకంగా ఓ నలుగురు ట్యూషన్ మాస్టార్లను పెట్టుకున్నారట. ట్యూషన్ ఎందుకయ్యా అంటే తప్పులు లేకుండా తెలుగులో మాట్లాడటానికట. నిజంగా ఎంత దుర్భరస్ధితిలో లోకేష్ ఉన్నాడో అర్ధమైపోవటం లేదూ.

 

తెలుగు వాడయ్యుండి, తెలుగు నేల గర్వపడే మహానటుడు ఎన్టీయార్ మనవడిగా పుట్టిన లోకేష్ కు తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడటం కూడా రాదంటే సిగ్గుపడాల్సిన విషయమే. విషయ పరిజ్ఞానం లేదంటే ఎలాగో సంపాదించుకోవచ్చు. కానీ తెలుగు మాట్లాడటం కూడా రాదంటే ఎవరు కూడా చేసేదేం లేదనే అనుకోవాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: