ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి...ఐదు నెలలు దాటుతుంది. అయితే ఇప్పటికి టీడీపీ నేతలు ఓటమి నుంచి కోలుకోలేదు. పైగా నేతలు వరుసగా పార్టీని వీడటం మరింత నష్టం తెచ్చి పెడుతుంది. దీంతో అధినేత చంద్రబాబు మాత్రం నేతలని ఓటమి ఫీలింగ్ నుంచి బయటపడేసేందుకు జిల్లాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఉండటం లేదు. మళ్ళీ నేతలు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఇక త్వరలోనే బాబు ప్రకాశం జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లా టీడీపీలో నిర్వేదం కనిపిస్తుంది. నేతలు ఎవరు పెద్ద యాక్టివ్ గా కనిపించడం లేదు. జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. వారు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే స్వామిలు నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. అటు సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణమ్ బలరాం పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి. ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొంత యాక్టివ్ గా ఉన్నారు.
జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన మాట ఎవరు వినడం లేదు. అలాగే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుని ఇష్టం లేకపోయిన ఒంగోలు లోక్ సభ బరిలో దించారు. అక్కడ ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన పెద్దగా పార్టీలో కనబడటం లేదు. అటు మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబు, ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్ లు అయితే అడ్రెస్ లేరు. మరి చూడాలి బాబు మీటింగ్ తర్వాత అయిన ప్రకాశం జిల్లా టీడీపీ ఏమన్నా యాక్టివ్ అవుతుందేమో.