కల్లు తగిన కోతి ఆ మత్తులో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది అనే సామెత ఉన్నది. మామూలుగానే కోతి చేష్టలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. కోతులు ప్రవర్తించే తీరు దారుణంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరిపై దాడి చేస్తాయో.. ఎలా ప్రవర్తిస్తాయో చెప్పక్కర్లేదు. వాటికీ ఆకలేసినపుడు ఎవరి చేతిలో ఏది ఉంటె అది లాక్కొని తినేస్తాయి. గడమాలని చూస్తే పైనపడి దాడిచేస్తాయి. అందుకే గమ్మున ఉండిపోతారు.
మాములుగా కల్లు తాగితేనే మత్తెక్కి చిత్తుగా చిందులు వేసే కోతికి మద్యం దొరికితే.. దాన్ని ఎంచక్కా తాగేస్తే ఇంకేం చేస్తుంది చెప్పండి. అది చేసే హంగామా చిందులు మాములుగా ఉండవు. అయితే, ఈ కోతి మాత్రం అలా కాదు.. మద్యం తాగి, చిప్స్ తిని.. మత్తులో ఊగిపోతూ నడుస్తూ వెళ్లి హాయిగా ఓ చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. ఈ సంఘటన సూర్యాపేటలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో చోటు చేసుకుంది.
మంగళవారం రోజున మద్యం దుకాణం షాపులోకి ఓ కోతి వచ్చింది. అక్కడ మద్యం సేవిస్తున్న వాళ్లతో కలిసి కూర్చుంది. పాపం మద్యం బాబులు ఉదారవాదులు కదా.. వాళ్ళు తాగుతూ అవసరమైతే వాళ్ళ పక్క వాళ్లకు కూడా మందు పోస్తుంటారు. అలానే పక్కన వచ్చి కూర్చున్న కోతికి కూడా గ్లాస్ లో మందుపోశారు. ఇంకేముంది.. ఆ కోతి మందును హ్యాపీగా లాగించేసింది. అలానే చిప్స్ ప్యాకెట్ తీసుకొని చిప్స్ లాంగించేసింది. కడుపులో వెయ్యి వోల్టుల శక్తి వచ్చినట్టైంది. లేచి కాసేపు చిందులు వేసింది.
ఎప్పుడైతే మత్తు తలకెక్కిందో అప్పుడే లేచి తూగుతూ వెళ్లి పది నిద్రపోయింది. ఇక మద్యం దుకాణంలో కోతి మద్యం తాగుతుంటే.. దాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. వైరల్ కావడంతో.. కోతి గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. స్వచ్చంద సేవా సంస్థలైతే.. ఇలా చేయడం తప్పని, కోతికి మందు అలవాటు చేస్తే.. అది రోజు అక్కడికి వస్తుందని, దాని జీవనం మారిపోతుందని అంటున్నారు. మరి చూద్దాం మరోలా ఆ మద్యం దుకాణం దగ్గరకు కోతి వస్తుందో రాదో.