ఆర్డర్....ఆర్డర్...

హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం మరో ‘స్థానిక’ సమరాన్ని ఎదుర్కోవల్సి వస్తోంది. అదిగో...ఇదిగో అంటూ స్థానిక సంస్థల్ని నిర్వహించకుండా కాలయాపన చేస్తూ వస్తోన్న సర్కార్కు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానం రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించడం లేదే తప్ప, ఓడిపోతామనీ భయంతో కాదనీ ఇప్పటి వరకు రాష్ర్టాన్ని ఏలుతున్న పాలకులు చెబుతూ వచ్చారు. అయితే,హైకోర్టు తీర్పుతో తప్పని సరి స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంతే కాకుండా, తాజా గణాంకాలు అందుబాటులో లేకున్నా, 2001జనాభా లెఖ్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చనీ న్యాయస్థానం రాష్ర్ట సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలకు ఏడాదికి పైగానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. దీనితో ప్రజలు అనేక అవస్థలకు గురౌతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: