మాజీ మంత్రి కన్నుమూత..! కేసీఆర్, హరీశ్ సంతాపం

Chakravarthi Kalyan

మాజీ మంత్రి, సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు చెరుకు ముత్యం రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో మృతి పొందుతూ మృతి చెందారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముత్యం రెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్.


దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన చెరుకు ముత్యం రెడ్డి.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఎమ్మెల్యేగా పని చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ముత్యం రెడ్డి పనిచేశారు. 2018లో ఆయన టీఆర్‌ఎస్ లో చేరారు. చెరుకు ముత్యం రెడ్డికి నిరాడంబర నేతగా మంచి పేరు ఉంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.


మంత్రిగా ఉన్నా కూడా ఆయన స్వయంగా వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం అంటే ఆయనకు తగని మక్కువ. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్య సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.


మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం దురదృష్టం అని ముఖ్యమంత్రి అన్నారు.


సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు . ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి బాధాకరమన్నారు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక గొప్ప నాయకున్ని కోల్పోయాం.. ఎమ్మెల్యే గా, మంత్రి గా , టిటిడి బోర్డు సభ్యులగా , ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు.. టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన కొద్దిరోజుల్లో వారు అందించిన సేవలు మరువ లేనివని హరీశ్ గుర్తు చేసుకున్నారు.


ముత్యం రెడ్డి చివరి దశ వరకు కూడా ప్రజా సేవలో పరితపించారు.. ఒక నిబద్ధత నాయకునిగా రాజకీయాల్లో రాణించారు.. ఒక అభివృద్ధి లో ఆదర్శ నాయకుడు..మాలాంటి ప్రజాప్రతినిధుల కు స్ఫూర్తి... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని హరీశ్ రావు తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: